Short News

వరుణ్, అనుష్క కొత్త లుక్స్

వరుణ్, అనుష్క కొత్త లుక్స్

వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ నటిస్తున్న చిత్రం 'సుయి ధాగా'. శ‌ర‌త్ క‌ఠారియా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో వ‌రుణ్‌ దర్జీగా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకాగా, అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంది. తాజాగా ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మీసంతో వ‌రుణ్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. సెప్టెంబర్ 28న చిత్ర రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.
ఎయిర్‌ ఏసియా టికెట్లపై 20శాతం డిస్కౌంట్‌ సేల్‌

ఎయిర్‌ ఏసియా టికెట్లపై 20శాతం డిస్కౌంట్‌ సేల్‌

విమానయాన సం‍స్థ ఎయిర్‌ ఏసియా మరోసారి డిస్కౌంట్‌ ఆఫర్ తెచ్చింది. స్పెషల్‌ ప్రమోషన్‌ పథకం కింద 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 25తో ముగియనుంది. మొబిక్విక్‌ ద్వారా మరో 15శాతం తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్‌ ద్వారా 2018 ఫిబ్రవరి 25నుంచి 28వరకూ దేశీయ ప్రయాణం చేయవచ్చు.
టీ20 ఫార్మాట్‌పై క్రికెట్‌ కోచ్‌ అసహనం

టీ20 ఫార్మాట్‌పై క్రికెట్‌ కోచ్‌ అసహనం

టీ 20 ఫార్మాట్‌ పై ఇంగ్లండ్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌ ట్రేవర్‌ బేలీస్‌ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసాడు. అంతర్జాతీయ టీ20లను అంతర్జాతీయ షెడ్యూల్‌ నుంచి తొలగిస్తే మంచిదంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఆదివారం న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాట్లాడుతూ ట్వంటీ 20 ఫార్మాట్‌ను ఫ్రాంచైజీల గేమ్‌గా చూడాలన్నాడు. ఐపీఎల్‌, బీబీఎల్‌ మాదిరి దేశవాళీ మ్యాచ్‌లకే టీ20 క్రికెట్‌ను పరిమితం చేయాలన్నాడు.
పీఎన్బీ స్కాంలో పెద్దల హస్తం, వారి వల్లే: కేజ్రీవాల్ సంచలనం

పీఎన్బీ స్కాంలో పెద్దల హస్తం, వారి వల్లే: కేజ్రీవాల్ సంచలనం

ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా వేల కోట్ల కుంభకోణాలు ఎలా సాధ్యమవుతాయని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. స్వచ్ఛ పాలన అని చెప్పుకుంటున్న బీజేపీ.. గతంలో కాంగ్రెస్ లాగే కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండు పార్టీల నైజం ఒకటేనని కేజ్రీవాల్ అన్నారు. పెద్దల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడటం సాధ్యం కాదన్నారు. 11వేల కోట్ల కుంభకోణం చేసిన నీరవ్ మోడీ దేశం నుంచి ఎలా పారిపో గలిగాడని కేజ్రీవాల్ ప్రశ్నించారు.