Short News

జూ.ఎన్టీఆర్ బ‌ర్త్ డేనాడు అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్!

జూ.ఎన్టీఆర్ బ‌ర్త్ డేనాడు అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్!

మే 20న బర్త్ డేను జరుపుకోనున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆ రోజున తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఎన్టీఆర్ కొత్త సినిమా నుంచి అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఉంటుందట. ఈ విషయాన్ని మహేష్ కోనేరు కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ బర్త్ డే గురించి చాలా యాంక్సైటీగా ఉన్నారు. మిమ్మల్ని నిరుత్సాహ పరచం. ఇంతకంటే ఎక్కువ నేను రివీల్ చెయ్యను. కానీ మీ కోసం ఆరోజు సమ్‌థింగ్ స్పెషల్ మాత్రం వెయిట్ చేస్తోంది'' అంటూ మహేష్ వెల్లడించారు.   
తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, నాగార్జున అక్కినేని కాంబినేష‌న్లో తెర కెక్కిన చిత్రం ఆఫీసర్‌. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చిన్న పాపపై తాను పాటను రూపొందించానని వ‌ర్మ చెప్పారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే..' అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్‌ చెప్పగా, తనదైన స్టైల్‌లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు.   
అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

దేశంలోని అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)నిలిచింది. 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ అత్యంత సంపన్న పార్టీగా నిలిచిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడించింది. ఎస్‌పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది.
బీకాం చదివే కూతురిపై మూడేళ్లుగా లైంగిక దాడి చేసిన తండ్రి

బీకాం చదివే కూతురిపై మూడేళ్లుగా లైంగిక దాడి చేసిన తండ్రి

వయసొచ్చిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కామంతో ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. మూడేళ్లుగా భార్య సహకారంతో.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కన్న కూతురిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డాడు ఒక కిరాతకుడు. తాజాగా ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కసాయి తండ్రి. అయితే ఇందుకు అతనికి సహకరించిన తల్లిని సైతం పోలీసులు కటకటాల్లోకి పంపారు.