Short News

రంగస్థలం తరువాత సైరానే.. అక్కడే భారీగా!

రంగస్థలం తరువాత సైరానే.. అక్కడే భారీగా!

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేసి రంగస్థలం గ్రామాన్ని నిర్మించారు. తాజగా సమాచారం ప్రకారం రంగస్థలం సెట్ లో మెగాస్టార్ సైరా చిత్రం షూటింగ్ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం కోసం వేసిన సెట్ లోనే మరో భారీ సెట్ నిర్మించి సైరా తదుపరి షెడ్యూల్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

రిసెర్చ్ లో కొన్ని నిజాలు, మహానటి సావిత్రి గురించి నిర్మాత ప్రియాంక దత్!

రిసెర్చ్ లో కొన్ని నిజాలు, మహానటి సావిత్రి గురించి నిర్మాత ప్రియాంక దత్!

సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్లో కనిపించబోతున్న సావిత్రి సినిమాను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై పాపులర్ అయ్యింది. సావిత్రి సినిమాలు చుసిన ప్రేక్షకులు సావిత్రిని మరోసారి స్క్రీన్ మీద చూడాలని కుతూహలంగా ఉన్నారు. ఆమె గురించి తెలియనివారు తన గురించి తెలుసుకోవాలని ఉన్నారు.

సహజమైన పద్ధతిలో క్యాన్సర్ను నివారించడం ఎలా ?

సహజమైన పద్ధతిలో క్యాన్సర్ను నివారించడం ఎలా ?

కారకాలను మార్పులు చేయడం ద్వారా నివేదించబడ్డాయని కొన్ని నివేదికలు తెలియజేశాయి. ఆ కారకాలు ఏమిటంటే ఉదాహరణకు:- ఆరోగ్యకరమైన శరీర బరువు, క్రమబద్ధమైన వ్యాయామం, మద్యమును తక్కువ వినియోగించడం వంటి మొదలైన చర్యలు.

జన్యుపరమైన మార్పులు, ధూమపానం, అదనపు బరువును కలిగి ఉండటం, నికోటిన్ను ఉపయోగించడం, వ్యాయామం చేయకపోవడం, రసాయనాలను కలిగి ఉన్న కాస్మెటిక్స్ను ఉపయోగించడం, రేడియేషన్ తీవ్రత, వంశపారపర్యంగా వచ్చే హార్మోన్ల అసమానత & ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల శరీరంలో ఏర్పడే వాపుల వంటివి క్యాన్సర్ని కలుగజేసే వ్యాధి కారకాలని చెప్పవచ్చు.

రాజ్యస‌భ సెక్ర‌టేరియ‌ట్ లో ఆక‌స్మిక త‌నిఖీలు

రాజ్యస‌భ సెక్ర‌టేరియ‌ట్ లో ఆక‌స్మిక త‌నిఖీలు

రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇవాళ రాజ్యసభ సెక్రటేరియట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. అధికారులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెడుతూ పలు సూచనలు చేశారు. పార్లమెంటు అనుబంధ కార్యాలయాల్లో ఈ తరహా తనిఖీలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాజ్యసభ ఛైర్మన్ ఇలా తనిఖీలు చేపట్టడం కూడా ఎప్పుడూ జరగలేదని సెక్రటేరియట్‌లోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. తనిఖీల అనంతరం వెంకయ్య నాయుడు సెక్రటేరియట్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.