Short News

సైరా జోరుకు బ్రేకులు.. చిత్ర యూనిట్‌కు నిరాశ కలిగించేలా!

సైరా జోరుకు బ్రేకులు.. చిత్ర యూనిట్‌కు నిరాశ కలిగించేలా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయో తెలిసిందే. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సినీవర్గాలు అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి ఎలా నటించబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ నగర శివారులో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్ఐఈఎల్ఐటీలో 63ఉద్యోగాలు: అప్లై చేయండి

ఎన్ఐఈఎల్ఐటీలో 63ఉద్యోగాలు: అప్లై చేయండి

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 63 ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం ఉద్యోగార్థులు ఆగస్టు 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
పోస్టుల సంఖ్య: 63
పోస్టు పేరు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
దరఖాస్తునకు చివరి తేదీ: ఆగస్టు 10, 2018

రెండో పెళ్లి అంటూ వార్తలు... అయోమయంలో పడేసిన సింగర్ సునీత!

రెండో పెళ్లి అంటూ వార్తలు... అయోమయంలో పడేసిన సింగర్ సునీత!

ప్రముఖ తెలుగు సింగర్ సునీత గురించి రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. 40 ఏళ్ల ఈ సింగర్ త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతోందంటూ ఆ వార్తల సారాంశం. ప్రముఖ పత్రికలకు చెందిన వెబ్ సైట్లలో సైతం ఈ రూమర్స్ గురించి వార్తలు రావడంతో తన ఫేస్ బుక్ పేజీ ద్వారా సునీత స్పందించారు. అయితే ఆమె స్పందించిన తీరు అభిమానులను మరింత అయోమయంలోకి పడేయడం గమనార్హం.తన రెండో పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై సింగర్ సునీత స్పందిస్తూ... ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మీకు ఎందుకంత ఆసక్తి? అంటూ ఫేస్‌బుక్ పేజీలో స్టేటస్ పెట్టారు.

ప్రియాంక చోప్రా ఓ టీవీ నటుడిని పెళ్లి చేసుకోవాల్సింది

ప్రియాంక చోప్రా ఓ టీవీ నటుడిని పెళ్లి చేసుకోవాల్సింది

హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ప్రేమలో ఉన్న నటి ప్రియాంక చోప్రా.. త్వరలోనే అతడిని పెళ్లాడనుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. పెళ్లి గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచనా లేదు. కానీ మా ఆంటీ ఈ విషయమపై చాలా తీవ్రంగా బాధ పడుతున్నారు. అందుకే టీవీ నటుడు మోహిత్‌ రైనాతో నా పెళ్లి కుదుర్చాలని భావించారు. మోహిత్‌ ప్రవర్తన, నిజాయితీ, ఆమెకు ఎంతగానో నచ్చాయి. అందుకే మోహిత్‌ను పెళ్లి చేసుకోవాల్సిందిగా నాకు సలహా ఇచ్చారంటూ' ప్రియాంక చెప్పింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more