Short News

వారిద్ద‌రి కంటే ముందే రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్నాడు

వారిద్ద‌రి కంటే ముందే రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్నాడు

రజనీ, కమల్ కంటే ముందే త‌మిళ హీరో విజయ్‌ రాజకీయాల్లోకి రావాలనుకున్నారట. తమిళ దర్శకుడు, విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ర‌జనీ, కమల్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు విజయ్‌ వస్తే ‘నటులంతా రాజకీయాల వైపు ఎందుకు వస్తున్నారు?' అని ప్రజలు ప్రశ్నిస్తారు. వారిద్దరి కంటే ముందే విజయ్‌ రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. ఇందుకోసం అభిమానులు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడైతే విజయ్‌కి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు లేవు.' అని చంద్రశేఖర్ వెల్ల‌డించారు.   
లక్ష్మీనారాయణ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?...

లక్ష్మీనారాయణ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?...

గుంటూరు:హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు...రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదంటున్నారు...కానీ వ్యవసాయ శాఖ మంత్రిని అయితే రైతుల కోసం ఏం చేయవచ్చో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నానన్నారు...ఒకవేళ వ్యవసాయ మంత్రిని కాకుంటే సామాజికవేత్తగా మారి ఏం చెయ్యాలో చూస్తానన్నారు... సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలివి. అయితే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణకు అసలు ఏం చెయ్యాలో స్పష్టత లేదా?...

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

దేశీయ టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో పెను సంచలనం సృష్టించింది. 2018-19లో 80 వేల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఛీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జియోలో సుమారు 1.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొత్తగా మరో 75 వేల నుంచి 80 వేల మందిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీరు డైట్ సోడాను ఇష్టపడే వారైతే, ఇది మీకు చెడు వార్త కావచ్చు. కృత్రిమ స్వీటెనర్లతో తయారుచేసిన తక్కువ కేలరీలు గల పానీయాలు & స్నాక్స్ మీకు మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్యాలను కలుగజేసే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యాయనంలో నిర్ధారించబడింది. వాటితో పాటు గుండె జబ్బుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కావచ్చు. ఈ వ్యాసం ద్వారా మనము కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాల గూర్చి పూర్తిగా తెలుసుకోబోతున్నాం.

కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాలను నమోదు చేశారు.