Short News

కృష్ణగారి సినిమా 'అత్తారింటికి దారేది'లా తీసి ఉంటే.. మన ఫ్రెండ్‌షిప్ కట్ అన్నారు.. తమ్మారెడ్డి!

కృష్ణగారి సినిమా 'అత్తారింటికి దారేది'లా తీసి ఉంటే.. మన ఫ్రెండ్‌షిప్ కట్ అన్నారు.. తమ్మారెడ్డి!

సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి సినీ అభిమానులందరికి తెలిసే ఉంటుంది. వర్ధమాన విని రాజకీయ వ్యవహారాలపై ఆయన తన అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడిస్తారు. సినీ ఇండస్ట్రీలో ఈ సమస్య వచ్చినా ఆయన చొరవ తీసుకుని స్పందిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. తాజగా ఆయన ఓ టివి ప్రోగ్రాంలో హాస్య నటుడు అలీతో ముచ్చటిస్తూ తన సినీ వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు వెల్లడించారు. అప్పట్లో ఓ పెద్ద హీరోయిన్ తో తమ్మరెడ్డికి ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలని అలీ ప్రస్తావించారు. ఆ వార్తలు 100 శాతం అబద్దం అని తమ్మారెడ్డి అన్నారు.

రిషబ్ పంత్ వల్లనే మ్యాక్స్‌వెల్ ఆడలేకపోయాడు

రిషబ్ పంత్ వల్లనే మ్యాక్స్‌వెల్ ఆడలేకపోయాడు

టీ20లీగ్ 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. అయితే ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ను ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ మ్యాక్స్‌వెల్ విఫలమయ్యాడు.అతడి పేలవ ప్రదర్శనపై ఢిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ స్పందించాడు. మ్యాక్స్‌వెల్ రెగ్యులర్‌గా ఆడే నాలుగో స్థానంలో పంత్‌ ఆడటంతో, బ్యాటింగ్‌ స్థానాలు పదేపదే మార్చాల్సివచ్చిందన్నారు. దాంతో మ్యాక్స్‌వెల్‌ సరిగా ఆడలేకపోయాడని తెలిపాడు.    
ఆది పినిశెట్టి, తాప్సీ మూవీ లాంచ్ చేయబోతున్న నాని

ఆది పినిశెట్టి, తాప్సీ మూవీ లాంచ్ చేయబోతున్న నాని

కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా బేనర్లో నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం అందించిన విజయంతో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు చిత్ర నిర్మాతలు. ఆది పనిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా వారు మరో సినిమా నిర్మించబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ మే 24న చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

బయోపిక్ పై స్పందించిన సానియా మీర్జా

బయోపిక్ పై స్పందించిన సానియా మీర్జా

బాలీవుడ్ ,టాలీవుడ్ లో బయోపిక్స్  ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి బయోపిక్ ఇప్పటికే విడుదలై ప్రశంసలు పొందుతుండగా త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి రానుంది. మరోవైపు క్రికెటర్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నాయి. సౌరవ్ గంగూలీ బయోపిక్ పై వార్తలు వెలువుడుతున్నాయి. టెన్నిస్ స్టార్ సానియామీర్జా బయోపిక్‌ను సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన సానియా బయోపిక్‌పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ... అయితే అధికారికంగా ఇంకా స్పష్టతకు రాలేదని క్లారిటీ ఇచ్చింది సానియా.