Short News

రివ్యూ : ఆకట్టుకోలేని 'తరుణ్ లవ్ స్టోరీ'

రివ్యూ : ఆకట్టుకోలేని 'తరుణ్ లవ్ స్టోరీ'

చెల్లెల్ని అమితంగా ప్రేమించే యాడ్‌ ఫిలిం డైరెక్టర్‌ అభిరామ్‌(తరుణ్‌) ఆమె ప్రేమించిన అబ్బాయితోనే పెళ్ళి ఫిక్స్‌ చేస్తాడు. ఆమె తనకు కాబోయే మరదలిని ఆన్నయ్యతో కలపాలని ప్రయత్నం చేస్తుంది. డాక్టర్‌ శృతిని కలిసేందుకు వెళుతూ ఒక అమ్మాయి (ఒవియా)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ దగ్గరవుతున్నారనగా పోలీసులు అభిరామ్‌ను అరెస్ట్ చేస్తారు. శృతి కంప్లయిట్‌ ఇచ్చినందుకే అరెస్ట్ చేసారని తెలిసి షాక్‌ అవుతాడు. అసలు శృతి ఎందుకు అలా చేసింది.?తెలియాలంటే 'ఇది నా లవ్ స్టోరీ' చూడాల్సిందే.
నేను రాలేను. కమల్ కు కేటీఆర్ ట్వీట్

నేను రాలేను. కమల్ కు కేటీఆర్ ట్వీట్

మ‌ధురైలో ఈ రోజు జ‌రుగ‌నున్న‌ త‌న‌ రాజ‌కీయ పార్టీ ఆవిర్భావ స‌భ‌కు క‌మ‌ల్ హాస‌న్‌ ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు. తెలంగాణ మంత్రి కేటీయార్‌ను కూడా ఆహ్వానించారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల రాలేక‌పోతున్నానని క‌మ‌ల్ కు చెప్పేశారు కేటీఆర్‌. కొత్త ఇన్నింగ్స్‌లోనూ మీరు రాణించాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు. మీ రాజ‌కీయ అరంగేట్ర కార్య‌క్ర‌మానికి ఆహ్వానించినందుకు మీకు ధ‌న్య‌వాదాలు అంటూ చెప్పారు కేటీఆర్.
గీతాంజలి జెమ్స్ షేరు కుదేలు ..రూ.419కోట్ల నష్టం

గీతాంజలి జెమ్స్ షేరు కుదేలు ..రూ.419కోట్ల నష్టం

నేటి ట్రేడింగ్ లో ప్రముఖ వజ్రాభరణాల సంస్థ 'గీతాంజలి జెమ్స్' షేర్లు భారీగా కుదేలయ్యాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ షేర్లు ఆరు రోజుల్లో 56శాతం నష్టపోయాయి. దీంతో ఆ కంపెనీకి రూ.419కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈరోజు బీఎస్‌‌ఈలో గీతాంజలి షేర్‌ విలువ రూ.27.45 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ.27.40 వద్ద ట్రేడవుతోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
త్వరగా జీర్ణమయ్యే బిస్కట్లు ఆరోగ్యకరమేనా.?

త్వరగా జీర్ణమయ్యే బిస్కట్లు ఆరోగ్యకరమేనా.?

డైజెస్టివ్ బిస్కట్ల గురించి వినే ఉంటారు. తేలికగా జీర్ణమయ్యే ఈ బిస్కట్లు  జీర్ణశక్తి సరిగా లేని రోగుల కోసం మార్కెట్లోకి వచ్చాయి. 21వ శతాబ్దంలో ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండిగా మారిపోయాయి. కానీ వీటిలో ఉండే చక్కెరలు, కొవ్వు పదార్థాలు, సోడియం ఈ బిస్కట్లు ఆకలిని తీర్చినా  అత్యధికంగా ప్రాసెస్ చేయడం వల్ల మంచివి కావని చెపుతున్నారు. ఒక్క బిస్కట్ కనీసం 50 అనారోగ్యకరమైన కేలరీలను కలిగి ఉంటుంది.