Short News

ప్రభాస్‌కు అభిమానిగా ఓ హాలీవుడ్ నటుడు

ప్రభాస్‌కు అభిమానిగా ఓ హాలీవుడ్ నటుడు

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఓ హాలీవుడ్ స్టారే అభిమానిగా మారిపోయాడు. ఈ మధ్యే ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన బ్లాక్ పాంథర్ మూవీలో ఎంబాకు రోల్ ప్లే చేశాడు. ఆ స్టార్ హీరో పేరు విన్‌స్టన్ డ్యూక్. లైవ్ విత్ కెల్లీ అండ్ రియాన్ షోలో పాల్గొన్న డ్యూక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాహుబలి సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. బాహుబలి అధికార ట్విట్టర్ అకౌంట్ డ్యూక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను స్క్రీన్‌షాట్ తీసి పోస్ట్ చేసింది.
కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలో నా నువ్వు సినిమాను విడుదల చెయ్యబోతున్నాడు. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గ నటిస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ ఆర్య, అతడు, జల్సా, దూకుడు వంటి హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంభందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

శ్రీరెడ్డి చేసింది తప్పు ..సభ్యత్వం ఇవ్వరు

శ్రీరెడ్డి చేసింది తప్పు ..సభ్యత్వం ఇవ్వరు

తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డి అంశంపై రాజమండ్రి ఎంపీ, సీనియర్‌ నటుడు మురళీమోహన్ స్పందించారు. 'భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను' అన్నారు. తెలుగు సినీరంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందటూ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. 
భారీ గోల్డ్ చైన్ అని...కుక్కగొలుసు చేతిలో పెట్టారు

భారీ గోల్డ్ చైన్ అని...కుక్కగొలుసు చేతిలో పెట్టారు

పశ్చిమగోదావరి:ఆకివీడు బంగారం పేరుతో మోసాలకు దిగే నేరగాళ్ల ఆవాసం...మెత్తటి తీయటి మాటలతో మెల్లిగా రంగంలోకి మొత్తంగా దోచుకుపోవడం అక్కడి మాయగాళ్లకి వెన్నతో పెట్టిన విద్య. ఆకివీడుకు చెందిన మేకల నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన బండి ఈశ్వరరావు తమ వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని, దాన్నితాకట్టు పెట్టి నగదు తీసుకుంటామని తాడేపల్లిగూడెంలోని కొసమట్టం ఫైనాన్స్‌ కంపెనీని సంప్రదించారు. తమ వద్ద ఉన్నది బాగా బరువుండే అరుదైన బంగారు ఆభరణం అని చెప్పారు.