Short News

'ఫిదా' ఏం లాభం లేదు.. అసలైనది తొలిప్రేమే !

'ఫిదా' ఏం లాభం లేదు.. అసలైనది తొలిప్రేమే !

ఎడారిలో నీటికోసం వెతుతుకుతున్నట్లు విజయం కోసం వెతుకుతున్న వరుణ్ కు ఫిదా చిత్రం ఒయాసిస్ లాగా కనిపించింది. వరుసగా వైవిధ్యమైన పత్రాలు చేస్తున్నప్పటికీ ఫిదా ముందు వరకు వరుణ్ కు విజయం దక్కలేదు. కానీ మంచి నటుడిగా ఎదుగుతాడని కంచె సినిమా తరువాత సినీ ప్రముఖులంతా తేల్చేశారు. ఫిదా చిత్ర విజయంలో వరుణ్ తేజ్ పాత్ర ఎంతంటే వెంటనే చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ చిత్రంలో హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి సక్సెస్ క్రెడిట్ మొత్తం ఎగరేసుకుపోయింది.

టీ20 ఫార్మాట్‌పై క్రికెట్‌ కోచ్‌ అసహనం

టీ20 ఫార్మాట్‌పై క్రికెట్‌ కోచ్‌ అసహనం

టీ 20 ఫార్మాట్‌ పై ఇంగ్లండ్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌ ట్రేవర్‌ బేలీస్‌ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసాడు. అంతర్జాతీయ టీ20లను అంతర్జాతీయ షెడ్యూల్‌ నుంచి తొలగిస్తే మంచిదంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఆదివారం న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాట్లాడుతూ ట్వంటీ 20 ఫార్మాట్‌ను ఫ్రాంచైజీల గేమ్‌గా చూడాలన్నాడు. ఐపీఎల్‌, బీబీఎల్‌ మాదిరి దేశవాళీ మ్యాచ్‌లకే టీ20 క్రికెట్‌ను పరిమితం చేయాలన్నాడు.
రోటామాక్‌ అధినేత నివాసాల్లో సీబీఐ తనిఖీలు

రోటామాక్‌ అధినేత నివాసాల్లో సీబీఐ తనిఖీలు

ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రోటామాక్‌ అధినేత విక్రమ్‌ కొఠారీ పలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.800కోట్లకు పైగా రుణాలు తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు కాన్పూర్‌లోని కొఠారీ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. కొఠారీ, ఆయన భార్య, కుమారుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలంటి అరెస్టులు జరగలేదని అధికారులు వెల్లడించారు.  
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి హవా: కాంగ్రెసు వెనకంజ

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి హవా: కాంగ్రెసు వెనకంజ

గుజరాత్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) హవా కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిజెపి 39 మున్సిపాలిటీల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది.

కాగా, కాంగ్రెసు పార్టీ 26 మున్సిపల్ కార్పోరేషన్లలో ఆధిక్యంలో ఉంది. శనివారంనాడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరిగింది. గుజరాత్‌లోని 28 జిల్లాల్లో జరిగిన పోలింగులో 64.4 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రస్తుతం బిజెపి రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీల్లో 59 సంస్థల్లో అధికారంలో ఉంది.