Short News

ఆశ్చర్యం : మహేష్, బన్నీ, రాంచరణ్.. వీళ్ళలో అంత క్రియేటివిటీ ఉందా..!

ఆశ్చర్యం : మహేష్, బన్నీ, రాంచరణ్.. వీళ్ళలో అంత క్రియేటివిటీ ఉందా..!

బాహుబలికి ముందు పరిస్థితి వేరు. టాలీవుడ్ ఇప్పుడున్న పరిస్థితి వేరు. దర్శక ధీరుడు రాజమౌళి తీసుకువచ్చిన ప్రమోషన్ టెక్నిక్స్ తో మిగిలిన వారు కూడా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు. బాహుబలి లాంటి సినిమా తీయడం ఒక ఎత్తు.. దానిని జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడం మరో ఎత్తు. రెండింటిలో రాజమౌళి విజయం సాధించారు. దీనితో బాహుబలి రికార్డులని టార్గెట్ గా పెట్టుకున్న టాలీవుడ్ హీరోలు సరికొత్త పంథాలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.

'ఆ హింస' అనుభ‌వించిన బాలుర‌కూ భ‌రోసా ఇవ్వాలి

'ఆ హింస' అనుభ‌వించిన బాలుర‌కూ భ‌రోసా ఇవ్వాలి

లైంగిక వేధింపులకు లింగ భేదం లేదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి మేనకా గాంధీ అన్నారు. లైంగిక వేధింపుల‌కు గురైన బాలికలకు అండ దండలు అందిస్తున్నట్లుగానే బాధిత బాలురకు కూడా చట్టం భరోసా ఇవ్వాలన్నారు. ఛేంజ్. ఓఆర్‌జీ అనే ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిలిం మేకర్ ఇన్సియా దారివాలా బాలురపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి పెట్టిన పిటిషన్‌పై మేన‌కా ఈ విధంగా స్పందించారు. బాలలపై లైంగిక వేధింపుల విషయంలో బాలురకు జరుగుతున్న అన్యాయం ఎక్కువగా నిర్లక్ష్యానికి గురవుతోందని మేనకా గాంధీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.   
ప్రొఫెసరక్లు కాలేజ్ అమ్మాయిల వల, సెక్స్ పాఠాలు జీవితాలు !

ప్రొఫెసరక్లు కాలేజ్ అమ్మాయిల వల, సెక్స్ పాఠాలు జీవితాలు !

మదురై కామరాజర్ యూనివర్శిటీలో పై అధికారుల దగ్గరకు కాలేజ్ అమ్మాయిలను పంపించి వారి కోరికలు తీర్చాలని సెక్స్ పాఠాలు చెప్పిన కేసులో అరెస్టు అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మరింత విచారణ చెయ్యాలని సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు. కాలేజ్ అమ్మాయిల జీవితాలకు సంబంధించిన కేసు కావడంతో పూర్తి సమాచారం సేకరించాలని సీబీసీఐడి అధికారులు నిర్ణయించారు. నిర్మలా దేవి వ్యవహారం లోతుగా దర్యాప్తు చెయ్యడానికి ఆమెను మరికొన్ని రోజులు విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీబీసీఐడీ అధికారులు న్యాయస్థానంలో మనవి చేశారు.

'ఆయ‌న' భ‌ద్ర‌త‌కు మాత్ర‌మే అంత సొమ్ము ఖ‌ర్చ‌యింద‌ట‌

'ఆయ‌న' భ‌ద్ర‌త‌కు మాత్ర‌మే అంత సొమ్ము ఖ‌ర్చ‌యింద‌ట‌

బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన ఆశారాం బాపు గత ఐదేళ్లుగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కారాగారంలో ఉన్నారు. 2013లో ఆశారాం అరెస్ట్ అయిన ఆయ‌న‌కు భద్రత కల్పించడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం రూ.7.25 కోట్లు ఖర్చుపెట్టిందట. ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగే సమయంలో ఆశారాం చుట్టూ 50 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. వారిలో ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు. ఏడాదికి దాదాపు వంద సార్లు ఆశారాం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేదని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం తెలిపింది. వాహనాలకు ఇంధనం ఖర్చు, ఇతర ఖర్చులేవీ ఇందులో చేర్చలేదని ప్రభుత్వం తెలిపింది.