Short News

అఖిల్ సినిమాలో ప్రముఖ హీరోయిన్.. నాగ్ కు నచ్చేసింది...

అఖిల్ సినిమాలో ప్రముఖ హీరోయిన్.. నాగ్ కు నచ్చేసింది...

అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అఖిల్ ఈ మద్య హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అఖిల్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ హలో పరువాలేదు అనిపించింది. తాజాగా ఈ హీరో వెంకి అట్లురితో సినిమా చెయ్యడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మద్య సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం చేసారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ నటిస్తున్నట్లు సమాచారం.వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాను తీసి మంచి విజయం సాధించిన వెంకి అట్లూరి చెప్పిన పాయింట్ నాగార్జునకు విపతీరంగా నచ్చడంతో ఈ కథను ఓకేచెయ్యడం జరిగింది.

శ్రీరెడ్డి చేసింది తప్పు ..సభ్యత్వం ఇవ్వరు

శ్రీరెడ్డి చేసింది తప్పు ..సభ్యత్వం ఇవ్వరు

తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డి అంశంపై రాజమండ్రి ఎంపీ, సీనియర్‌ నటుడు మురళీమోహన్ స్పందించారు. 'భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను' అన్నారు. తెలుగు సినీరంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందటూ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. 
వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్ర మొదలైంది

వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్ర మొదలైంది

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్రకు రెడీ అవుతున్నాడు. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు క్రిష్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గురువారం ప్రారంభించారు. అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం లీడ్ యాక్టర్స్‌ కొద్ది రోజులుగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో వ్యోమగామిగా కనిపించనున్నాడట.  
బాలకృష్ణ ఎన్ని సార్లు అలా మాట్లాడలేదు.. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే టార్గెట్, ఎందుకో మాకు తెలుసు!

బాలకృష్ణ ఎన్ని సార్లు అలా మాట్లాడలేదు.. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే టార్గెట్, ఎందుకో మాకు తెలుసు!

శ్రీరెడ్డి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా మారడం వెనుక ఉన్న కుట్రలు తనకు తెలుసు అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. శ్రీరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతుండడంతో ఆయన టీవీ9 తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్రోలింగ్ వలనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలకు ఆయన ధీటైన సమాధానం ఇచ్చారు.పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ట్రోలింగ్ చేయరని అన్నారు. ట్రోలింగ్ చేస్తున్న వారంతా పవన్ కళ్యాణ్ అభిమానులే అని గ్యారెంటీ ఉందా అంటూ ప్రశ్నించారు.