
గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ మిత్రుడు, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు శనివారం చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో నామినేషన్ వేశారు. శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా హాజరైనారు. శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరైనారు. బీఎస్. యడ్యూరప్పను చూసిన వెంటనే గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం రాజీనామా చేశారు. తరచూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తూ సంచలనంగా మారిన ఆయన.. ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాజీనామా చేసిన సందర్భంగా ఆయన 'రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నా' అని ప్రకటించారు. అంతేగాక, తాను ఇక ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని సిన్హా స్పష్టం చేశారు. జనవరిలో తాను ప్రారంభించిన రాష్ట్రమంచ్ సంస్థ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని చెప్పారు.