Short News

ఉదయ్ కిరణ్ బయోపిక్‌‌లో ఇవి ఉంటాయా? తమ్ముడు గురించి, చిరంజీవి గురించి సోదరి శ్రీదేవి ఏమంది?

ఉదయ్ కిరణ్ బయోపిక్‌‌లో ఇవి ఉంటాయా? తమ్ముడు గురించి, చిరంజీవి గురించి సోదరి శ్రీదేవి ఏమంది?

తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పరిశ్రమలో ఓ సంచలనం. అప్పట్లో ఆయన మరణంపై అనేక పుకార్లు, అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే దేనికీ సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతోందని, దానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు తెరపైకి రావడంతో మరోసారి ఈ యంగ్ హీరో గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దయ్ మరణించిన కొన్ని రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో అతడి సోదరి శ్రీదేవి(మస్కట్లో ఉంటారు) పలు విషయాలు పంచుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు.

హానర్ 7ఎ విడుదల ఎప్పుడంటే..

హానర్ 7ఎ విడుదల ఎప్పుడంటే..

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. 5.7 ఇంచ్ లు గల భారీ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.
కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ వారికి ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి

కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ వారికి ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి

కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ కావాలనుకునేవారు ఆధార్‌, పాన్‌ను తప్పనిసరిగా సమర్పించాలని, కేంద్ర ఎక్సైజ్‌, కస్టమ్స్‌ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వ్యాపార సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు చేయటం, ఆడిట్‌ నిర్వహించడం తదితర కార్యకలాపాలను అధికారికంగా నిర్వహించాలంటే కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ కావాల్సి ఉంటుంది. ఈ మేరకు అందుకు అనుమతులు పొందాలంటే కస్టమ్స్‌ బ్రోకర్స్‌ లైసెన్స్‌ రెగ్యులేషన్స్‌ 2018 ప్రకారం సదరు వ్యక్తి తన ఆధార్‌, పాన్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
డెత్‌ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతోనే గెలిచాం

డెత్‌ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతోనే గెలిచాం

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే డెత్‌ ఓవర్లలో ప్రసిద్ధ్‌ అద్భుత ప్రదర్శనతోనే కోల్‌కతా విజయం సులభమైందంటున్నాడు ఆ జట్టు యువ బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.డెత్‌ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్‌ బౌలింగ్‌ ప్రదర్శనే మ్యాచ్‌ను మావైపు తిప్పేలా చేసింది. అతను సులువుగా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడని' అని గిల్‌ చెప్పుకొచ్చాడు.