Short News

విజయ్‌తో ఢీ కొనెందుకు  రెడీ.?

విజయ్‌తో ఢీ కొనెందుకు రెడీ.?

ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ నటి అంటే వరలక్ష్మీశరత్‌కుమార్‌నే.అరుదైన నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించడానికి సై అంటున్నారు. విజయ్, దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. విజయ్‌ 62వ చిత్రంలో తన పాత్ర కీలకంగా ఉంటుందని వరలక్ష్మీశరత్‌కుమార్‌ చెప్పారు. ఇందులో  విజయ్‌తో ఢీకొనే రాజకీయ నాయకురాలిగా కొంచెం నెగిటివ్‌ చాయలున్న పాత్రలో ఆమె నటిస్తున్నారని ప్రచాంర జరుగుతోంది.
కూతురిపై తండ్రి రేప్: సంచలన తీర్పిచ్చిన కోర్టు

కూతురిపై తండ్రి రేప్: సంచలన తీర్పిచ్చిన కోర్టు

మానసిక వికలాంగురాలైన 17 ఏళ్ళ కూతురిని తల్లిని చేసిన తండ్రికి తంజావూరు మహిళా కోర్టు నాలుగు జీవిత ఖైదులను విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేశాడు. ఈ విషయం తెలిసిన తల్లి భర్తపై ఫిర్యాదు చేసింది. ఏడాది తర్వాత తంజావూరు కోర్టు నిందితుడికి నాలుగు జీవిత ఖైదులు విధించింది.

పానిక్ అటాక్ నుండి బయటపడే సహజ మార్గాలు ఇవే ..!

పానిక్ అటాక్ నుండి బయటపడే సహజ మార్గాలు ఇవే ..!

మీరెప్పుడైనా విపరీతమైన భయానికి మరియు ఆందోళనలకు గురై, గుండె పగిలి పోతున్నట్లు, ఊపిరి ఆగిపోయినట్లు అనుభూతికి లోనయ్యారా? అనేకమంది సహజంగా ఎదుర్కునే అనుభవాలలో ఇది కూడా ఒకటి.

ఒకవేళ మీరు ఈపరిస్థితికి లోనై ఉంటే, దీనిని పానిక్ అటాక్ అని అంటారు. దీనినే ఆందోళనల దాడిగా కూడా వ్యవహరిస్తారు.

అసలేమిటి ఈ పానిక్ అటాక్:

పానిక్ అటాక్ అనేది ఆందోళనలకు సంబంధించిన ఒక మానసిక సమస్య లేదా స్థితిగా చెప్పబడుతుంది. ముఖ్యంగా మెదడు అధిక ఒత్తిడులకు లోనైనప్పుడు, లేదా భయానికి గురైనప్పుడు ఈ పరిస్థితిని సాధారణంగానే ఎదుర్కొంటూ ఉంటాము.

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

గూగుల్ ఇండియా సెర్చ్ బార్ జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోడీగా మార్చివేసింది. ఇండియా తొలి ప్రధాని అని సెర్చ్ చేస్తే, జవహర్ లాల్ నెహ్రూ బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కనిపిస్తుండటంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక సెర్చ్ చేస్తే తొలుతగా వికీపీడియా లింక్‌ను చూపిస్తున్న గూగుల్ సెర్చ్ బార్, పక్కనే నరేంద్ర మోమై ఫోటోను చూపిస్తోంది. ఆయన పేరును నెహ్రూగా చూపిస్తోంది. ఇక ఈ తప్పిదంపై కాంగ్రెస్ సోషల్ మీడియా తీవ్రంగా విరుచుకుపడుతోంది. గూగుల్ ఇలాంటివి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.