Short News

ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వర రావు కన్ను మూత !

ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వర రావు కన్ను మూత !

బొట్టు కాటుక ,సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన దుర్గా నాగేశ్వరరావు ఈ రోజు హైదరాబాద్ లోని రామాంతపూర్ లో కన్ను మూశారు. ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ , సీనియర్ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభలో ఈరంకి శర్మ ద్వారా వెండి తెరకు పరిచయమైన నటులు జీ వీ నారాయణ రావు, హేమ సుందర్ ,రూపా దేవి లతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ , గార సత్యం తదితరులు పాల్గొని దివంగత దర్శకులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు .

తమిళంలో 'భ‌ర‌త్ అనే నేను' రీమేక్.!

తమిళంలో 'భ‌ర‌త్ అనే నేను' రీమేక్.!

మ‌హేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన చిత్రం 'భరత్ అనే నేను'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ నాయిక. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే  తాజా స‌మాచారం ప్ర‌కారం చిత్రాన్ని తమిళ నటుడు విజయ్ తో రీమేక్ చేసి విడుద‌ల చేయాలని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. విజయ్ గతంలో మ‌హేష్ ఒక్క‌డు, పోకిరి సినిమాలను తమిళంలో రీమేక్ చేసాడు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.
'ఉద్ధమ్‌ సింగ్‌'గా ఇర్ఫాన్ ఖాన్ ..త్వరలో షూటింగ్

'ఉద్ధమ్‌ సింగ్‌'గా ఇర్ఫాన్ ఖాన్ ..త్వరలో షూటింగ్

బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ న్యూరోఎండోక్రైన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టుగా ప్రకటించిన దగ్గర నుంచి ఆయన ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వచ్చాయి. తాజాగా ఇర్ఫాన్‌ ఖాన్‌ సన్నిహితుడు, దర్శకుడు సూర్జిత్‌ సర్కార్‌ ఇర్ఫాన్‌ ఆర్యోగ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ప్రస్తుతం ఇర్ఫాన్‌ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన ఉద్ధమ్‌ సింగ్‌ బయోపిక్‌లో నటిస్తారు' అంటూ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. ఈ కథలో ముందుగా రణబీర్‌ కపూర్‌ నటిస్తాడన్న వార్తలు వినిపించాయి.
హిట్ కాదు ..అసలు ఆడలేదు ..కానీ చూసేయండి

హిట్ కాదు ..అసలు ఆడలేదు ..కానీ చూసేయండి

నాని నటించిన చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ మూవీలో నాని రెండు పాత్ర‌ల‌లో నటించాడు. ఈ చిత్ర డిజిటల్ హక్కులను కొనుక్కున్న యాప్ టీవీ ట్విట్ట‌ర్ ద్వారా 'నాని సూప‌ర్ హిట్ చిత్రం కృష్ణార్జున యుద్ధం సినిమాని మా డిజిట‌ల్ కంటెంట్‌లో చూడండి' అని పేర్కొంది. దీనికి స్పందించిన నాని 'సూప‌ర్ హిట్ అవ్వ‌లేదు బాబాయ్, ఆడ‌లేదు కూడా.. కాని మ‌న‌సు పెట్టి చేసాం.. చూసేయండి' అని రీట్వీట్‌ చేసాడు. చిత్రంలో క‌థానాయిక‌లుగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ నటించారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more