Short News

నటి విజయశాంతి మేనేజర్‌ కిడ్నాప్ కలకలం

నటి విజయశాంతి మేనేజర్‌ కిడ్నాప్ కలకలం

కాంగ్రెస్ నేత, సీనియర్ నటి విజయశాంతి మేనేజర్‌ సైదాచారి కిడ్నాప్ గురయ్యాడు. ఈ ఘటన భువనగిరి జిల్లాలో జరిగింది. రూ. 50 లక్షలు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ దుండగులుచేశారు. అసలు విషయం ఏంటంటే.. సైదాచారి ఓ మహిళకు డబ్బు బాకిపడ్డారు. అప్పు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో విసుగుచెందిన ఆమె కిడ్నాపర్లను రంగంలోకి దించింది. సైదాచారి కుటుంబం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. చాకచక్యంగా సైదాచారిని కిడ్నాప్ చేసిన 8 మంది దుండగులను అరెస్టు చేశారు.
న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి  సిక్కు మహిళ

న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి సిక్కు మహిళ

గురుశోచ్‌ కౌర్‌ అనే సిక్కు మహిళ తొలిసారిగా అరుదైన ఘనత సాధించారు. తలపాగా ధరించిన ఓ సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో చేరనున్నారు. న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు. యూఎస్‌ ప్రజలు సిక్కిజాన్ని అర్థం చేసుకునే విధంగా గురుశోచ్‌ కౌర్‌ మార్పుతేవాలని ‘మినిష్టర్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌' హరదీప్‌ సింగ్‌ పూరి కోరారు.
పాకిస్తాన్ లో హిందూ  ఆలయానికి రూ 2 కోట్లు కేటాయింపు

పాకిస్తాన్ లో హిందూ ఆలయానికి రూ 2 కోట్లు కేటాయింపు

పాకిస్తాన్ లో హిందూ ఆలయానికి భారీగా నిధులు కేటాయించారు. రావల్పిండి సిటీలోని పురాతన కృష్ణుడి దేవాలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రూ.2కోట్లు విడుదల చేసింది. పండుగల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భాల్లో హిందువులు అత్యధిక మంది దర్శనం కోసం వచ్చినప్పటికీ ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని పునరుద్ధరించనున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల్లో పూజలందుకుంటున్న ఏకైక హిందూ ఆలయం కృష్ణ దేవాలయం మాత్రమే కావడం విశేషం.
నేను బొమ్మను కాదు, సరికొత్త రాజకీయ వ్యవస్థ: జగన్‍‌కు పవన్

నేను బొమ్మను కాదు, సరికొత్త రాజకీయ వ్యవస్థ: జగన్‍‌కు పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో టీడీపీ, వైసీపీ, బీజేపీలపై విరుచుకు పడ్డారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను కాదన్నారు. సీఎం కావాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రాలేదన్నారు. 2019లో కచ్చితగా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు. 2019లో కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అప్పుడు సరికొత్త ప్రభుత్వం వస్తుందన్నారు. ఓట్లు కొనే రాజకీయాలు వారివి అయితే, మనవి మనుసులు దోచుకునే రాజకీయాలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు.