Short News

‘విశ్వరూపం 2’ మేకింగ్ వీడియో: కమల్ హాసన్ ఈ వయసులోనూ...
<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/kCPEKy7Ujxw" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

‘విశ్వరూపం 2’ మేకింగ్ వీడియో: కమల్ హాసన్ ఈ వయసులోనూ...

కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వరూపం-2' ఆగస్టు 10న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలో విడుదలవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'విశ్వరూపం 2' మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వయసులోనూ కమల్ హాసన్ చేసే ఫీట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అతడు చేసే యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని స్పష్టమవుతోంది.

ఇతర భాషల్లోకి దూసుకుపోతున్న 'ఆర్ఎక్స్ 100'

ఇతర భాషల్లోకి దూసుకుపోతున్న 'ఆర్ఎక్స్ 100'

ఇటీవ‌ల భారీ విజ‌యాన్ని సాధించిన 'ఆర్ఎక్స్ 100' సినిమా ఇతర భాషల్లోకి వెళుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించారు. ఈ సినిమా హిట్ అవడంతో రీమేక్ హక్కులు భారీగా అమ్ముడవుతున్నాయి. ఈ సినిమా హిందీ వర్షన్ అజయ్ దర్శకత్వంలోనే వస్తుందని తెలుస్తుండగా తమిళ రీమేక్ హక్కులను ఆది పినిశెట్టి సొంతం చేసుకున్నాడట‌. దీనిలో ఆది పినిశెట్టినే హీరోగా నటించనున్నాడని హీరోయిన్ గా తాప్సీని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. 
ఆగస్టు 21న మెగా అభిమానులకు 'చిరు' గిఫ్ట్

ఆగస్టు 21న మెగా అభిమానులకు 'చిరు' గిఫ్ట్

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా'. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. మూవీ ఫ‌స్ట్ లుక్ నేడు విడుద‌లవుతుంద‌ని అభిమానులు భావించారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన సైరా బృందం ఆగ‌స్ట్ 21 ఉద‌యం 11.30ని.ల‌కి చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు , సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రాన్ని వేసవిలో విడుద‌ల చేయ‌నున్నారు.
మూవీ రివ్యూలు: గీతా గోవిందం, గోల్డ్ మూవీ

మూవీ రివ్యూలు: గీతా గోవిందం, గోల్డ్ మూవీ

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం, అలాగే బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ చిత్రాలు విడుదలయ్యాయి. తొలి ఆట నుంచే ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నాయి.అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత విజయ దేవరకొండ మహానటి చిత్రంలో నటించాడు.అయితే ప్రస్తుతం అందాల భామ రష్మిక మందన్నతో జతకట్టి విజయ్ సోలోగా గీత గోవిందం చిత్రంతో ముందుకొచ్చాడు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more