Short News

సినీ ర‌చ‌యిత రాజ‌సింహా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

సినీ ర‌చ‌యిత రాజ‌సింహా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసిన రచయిత రాజసింహా ముంబైలో ఆత్మహత్యా యత్నం చేశారు. కొంత కాలంగా అవకాశాలు లేక రాజసింహా నిరాశ‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెర కెక్కిన ఒక అమ్మాయి తప్ప సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజసింహా, ఆ సినిమా ఆశించిన స‍్థాయిలో విజయం సాధించకపోవటంతో అవకాశాలు తగ్గాయి. శంకర్‌దాదా ఎంబీబీయస్‌, బొమ‍్మరిల్లు, జుమ్మందినాధం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహా రచయితగా పనిచేశారు.  నీ స్నేహం, టక్కరిదొంగ సినిమాల్లో నటుడిగానూ కనిపించారు.    
ఫ్లిప్‌కార్ట్‌  ఆపిల్ వీక్ సేల్..తక్కువ ధరలకు ఆపిల్ ఉత్పత్తులు

ఫ్లిప్‌కార్ట్‌ ఆపిల్ వీక్ సేల్..తక్కువ ధరలకు ఆపిల్ ఉత్పత్తులు

ఆపిల్‌ అభిమానులకు శుభవార్త. ఆపిల్‌ వీక్‌ సేల్‌ పేరుతో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌ను ప్రారంభించింది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్‌ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్‌, ఎంపిక చేసిన ఆపిల్‌ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, మే 27 వరకు జరుగనుంది.   
డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

ఎండాకాలం వచ్చిందంటే కొన్ని చర్మ సమస్యలు కూడా వెంట వస్తాయి. వేసవిని ఆనందంగానే స్వాగతిస్తాము. అయితే, వేసవితో పాటు వెంట వచ్చే చర్మ సమస్యలు మనల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అందులో ముఖ్యంగా మనం సన్ బర్న్ సమస్య గురించి చెప్పుకోవాలి. ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మం కమిలినట్లు మారుతుంది. దీనినే సన్ బర్న్ అనంటారు. సూర్యరశ్మిలో కొన్ని హానికర కిరణాలు చర్మాన్ని తాకడం వలన చర్మం దెబ్బతింటుంది. ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు.

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. పీఎన్‌బీని భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీకి చెందిన రూ.170 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్‌ మోదీ ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఆస్తుల అటాచ్‌మెంట్‌ మాత్రమే కాక నీరవ్‌ మోదీ, అత‌డి సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా ఈడీ అటాచ్‌ చేసుకుంది.