Short News

భారత్‌లో లభించే బెస్ట్ బైకులు - ధర రూ.5 లక్షల కంటే తక్కువే..

భారత్‌లో లభించే బెస్ట్ బైకులు - ధర రూ.5 లక్షల కంటే తక్కువే..

మార్కెట్లో టూ-వీలర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. భారత్‌లో రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన బైకులు లభిస్తాయి. ఈ కథనంలో రూ.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు గురించి తెలుసుకుందాం.దేశీయ విఫణిలో రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ప్రధానంగా.. రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ650, కేటిఎమ్ 390 డ్యూక్, కేటిఎమ్ RC 390, యమహా ఆర్3, ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మరియు ట్రయంఫ్ స్పీడ్ 400 వంటివి ఉన్నాయి. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ధర కూడా రూ. 5 లక్షల కంటే తక్కువగానే ఉంటాయి.
ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్ ట్రైన్‌ కోసం ‘బాలస్ట్‌లెస్‌' ట్రాక్‌

ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్ ట్రైన్‌ కోసం ‘బాలస్ట్‌లెస్‌' ట్రాక్‌

భారత్‌లో త్వరలో బుల్లెట్ రైళ్లు(Bullet Trains) అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చైనా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే బుల్లెట్ రైళ్లు నడుస్తుండగా.. ఈ దేశాల సరసన త్వరలో భారత్ కూడా చేరనుంది. ఈ క్రమంలో బుల్లెట్‌ రైలుకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు.
ఏథర్‌ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు..

ఏథర్‌ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు..

కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ టూ వీలర్‌ తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ(Ather Energy) గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది. ఏథర్‌ ఎనర్జీ నుంచి భారీ అంచనాలతో త్వరలో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్కూటర్‌ రిజ్టా(Ather Rizta)కు సంబంధించి ప్రీ బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్‌ AMT కొత్త వేరియంట్లు విడుదల..

రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్‌ AMT కొత్త వేరియంట్లు విడుదల..

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors).. తన ప్రముఖ మోడల్‌ నెక్సాన్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ లైనప్‌ను మరింత విస్తరించింది. నెక్సాన్‌లో ఇప్పుడు 5 కొత్త వేరియంట్లను ఆటోమేటెడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌(AMT) వెర్షన్‌లో తీసుకువచ్చింది. ధర, ఇతర వివరాలు పూర్తి సమాచారం ఈ కథనంలో...