Short News

ఎయిర్ పోర్టులో ప్రకాష్ రాజ్ కు బెదిరింపులు, డ్రైవర్ కు

ఎయిర్ పోర్టులో ప్రకాష్ రాజ్ కు బెదిరింపులు, డ్రైవర్ కు

మంగళూరులో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఎయిర్ పోర్టు బయట ఉన్న తన కారు డ్రైవర్ దగ్గరకు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి అతని పేరు, వివరాలు, నేను రాత్రి ఎక్కడ బసచేస్తాను అనే పూర్తి వివరాలు అడిగారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. తనకు భద్రత కల్పించడానికి అదే సమయంలో పోలీసులు ఎయిర్ పోర్టు దగ్గరకు వచ్చారని, పోలీసులను చూసిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రైవర్ కు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారని, లేదంటే తనకు నేరుగా వార్నింగ్ ఇచ్చేవారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ప్రజల సమస్యలు.

'ఎంఎల్‌ఏ' మిమ్మల్ని తప్పక అలరిస్తాడు

'ఎంఎల్‌ఏ' మిమ్మల్ని తప్పక అలరిస్తాడు

నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తోన్న చిత్రం 'ఎంఎల్‌ఏ'. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం  ర్చి 23న విడులవుతుంది. ఈ మూవీలో కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి కడుపుబ్బా నవ్వించనున్నారు. చిత్ర విడుదల సంధర్భంగా చిత్రబృందానికి విషెస్ తెలిపాడు బ్రహ్మీ. అవుట్ అండ్ అవుట్ కామెడీతో తెరకెక్కిన 'ఎంఎల్‌ఏ-మంచి లక్షణాలున్న అబ్బాయి' వేసవిలో తేనేటి విందులా ఉంటుందని, సినిమా తప్పక చూడండని ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసాడు బ్రహ్మీ. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌.
రామ్ చరణ్ ఎనర్జీ అదుర్స్: ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ ప్రోమో
<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/XsdbNvZnD70" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

రామ్ చరణ్ ఎనర్జీ అదుర్స్: ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ ప్రోమో

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమో మంగళవారం విడుదల చేశారు. 37 సెకండ్ల నిడివిగల ఈ ప్రోమో సినిమాపై అంచనాలు మరింత పెంచింది. రామ్ చరణ్ తన ఎర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాట గురించి తన ఫేస్ బుక్ పేజీలో రామ్ చరణ్ పేర్కొంటూ... 'ఇప్పటి వరకు తన సినిమాల్లో ఇదే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాట మీతో కూడా స్టెప్పులేయిస్తుంది' అంటూ పేర్కొన్నారు. రంగస్థలం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

టీడీపీ-వైసీపీలకు షాక్: 'అవిశ్వాసం అంటే పిల్లలాట కాదు'

టీడీపీ-వైసీపీలకు షాక్: 'అవిశ్వాసం అంటే పిల్లలాట కాదు'

తెలంగాణ సీఎం, తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం మేరకే తాము పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మంగళవారం చెప్పారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీయే ఈ నాటకం ఆడిస్తోందని వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. తమ పార్టీని ఆడించే సత్తా ఎవరికీ లేదన్నారు. అవిశ్వాస తీర్మానం అంటే పిల్లలాట కాదన్నారు.