Short News

'మొన్న బీహార్.. నిన్న కర్ణాటక.. రేపు?': తిరగబడ్డ బీజేపీ

'మొన్న బీహార్.. నిన్న కర్ణాటక.. రేపు?': తిరగబడ్డ బీజేపీ

బుధవారం అర్థరాత్రి హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు బీజేపీకే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. గురువారం ఉదయం యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ నిర్ణయం అనైతికమంటూ సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్, జేడీఎస్ లకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగలింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కొన్ని మౌళికమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన రాజకీయ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరైనదా?..

ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గెలిచింది. సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. బ్యాట్స్ మెన్స్ పేలవ ప్రదర్శనతో సొంతగడ్డపై 163 పరుగులకే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. అంతకుముందు ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ ఆఫ్ సెంచరీ సాధించాడు.
పెట్రోల్‌ ధరలు పెంపుపై స్పందించిన కేంద్రమంత్రి

పెట్రోల్‌ ధరలు పెంపుపై స్పందించిన కేంద్రమంత్రి

పెట్రోల్‌ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంపై కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. పెట్రో ఉత్పత్తులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం.. పెట్రోల్‌, డిజిల్‌ ధరలపై ప్రభావం చూపిందన్నారు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెరుగుదలతో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భారత ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు.
అందరికి థ్యాంక్స్..యంగ్ టైగర్ ఎన్టీఆర్

అందరికి థ్యాంక్స్..యంగ్ టైగర్ ఎన్టీఆర్

నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వరుస ట్వీట్లు చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ల నా కెరీర్‌లో కష్టసుఖాల్లో నాకు శాశ్వతంగా తోడున్నది, అండగా నిలిచింది ప్రేక్షకుల ప్రేమ, అదరణే. మీ రుణం తీర్చుకోగలుగుతానని భావించడం లేదు. అభిమానులకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.నా కొలిగ్స్‌కి, నా శ్రేయోభిలాషులు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ బిగ్ థ్యాంక్స్'అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.