Short News

ఆశారాంబాపూ ఒకప్పుడు ఎం చేశాడో తెలుసా.?

ఆశారాంబాపూ ఒకప్పుడు ఎం చేశాడో తెలుసా.?

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో చిక్కుకున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాంబాపూ 2013 నుంచి జైలులో ఉంటున్నారు. ఈ కేసులో ఈనెల 25న తీర్పు వెలువడనుంది. అయితే ఆశారాంబాపూ గురువుగా మారడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. తన తండ్రి చనిపోయాక విద్యకు దూరమై బొగ్గు వ్యాపారం చేశారట. అయితే ఆ వ్యాపారం అతనికి నచ్చలేదట. తన 15 వ ఏట ఇంటిని విడిచిపెట్టి ఒక ఆశ్రమానికి చేరుకున్నారట. పెళ్లి నిశ్చయమైన 8 రోజులకు మందు ఆశ్రమానికి వచ్చేశారట. అయితే తరువాత అతనికి వివాహం జరిగిందట. లీలాషా అనే గురువు నుంచి ఆశారాం దీక్ష తీసుకున్నారట. అప్పడే అతని పేరు ఆశారాంబాపూగా మారిందట
సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు మ్యాచ్‌ల రిఫరీ వార్నింగ్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు మ్యాచ్‌ల రిఫరీ వార్నింగ్

టీ20 లీగ్ 2018లో భాగంగా మంగళవారం ముంబై,హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 16వ ఓవర్‌ వేసిన సిద్ధార్త్‌ కౌల్‌ ఓవర్‌ చివరి బంతికి ముంబై ఆటగాడు మయాంక్‌ మార్కండేను ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టించాడు.కానీ వికెట్ తీసిన ఆనందంలో బౌలర్‌ కౌల్‌.. ఔటైన క్రికెటర్‌ మయాంక్‌ మార్కండేను వెక్కిరించాడు. దీన్ని ముంబై ఆటగాళ్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యలో సన్‌రైజర్స్‌ జట్టుకు ఐపీఎల్‌ మ్యాచ్‌ల రిఫరీ వార్నింగ్‌ ఇచ్చారు. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపిన అనంతరం అతడి గేమ్‌ పాయింట్లలో కోత విధించే అవకాశాలున్నాయి.
రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రెండు లాభాలేమిటో తెలుసా?

రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రెండు లాభాలేమిటో తెలుసా?

రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే వారు స్లిమ్‌గా ఉండటంతో పాటు మున్ముందు బరువు పెరగకుండా ఉంటారని తాజా అధ్య‌యనం వెల్లడించింది. కేలరీలను తగ్గించుకునేందుకు, నాజూకుగా ఉండేందుకు పలువురు అల్పాహారం తీసుకోవడాన్ని విస్మరిస్తుంటారని, ఇది సరైంది కాదని మయో క్లినిక్‌ నిర్వహించిన అధ్య‌యనం పేర్కొంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే 350 మందిని పరిశీలించగా వారి నడుము భాగం సాధారణంగా ఉన్నట్టు గుర్తించామని, పదేళ్ల తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోనివారు ఎనిమిది పౌండ్లు పెరిగారని తెలిపింది.    
పెళ్లిళ్ల సీజన్‌తో బంగారు, వెండి ధరలకు రెక్కలు

పెళ్లిళ్ల సీజన్‌తో బంగారు, వెండి ధరలకు రెక్కలు

పెళ్లిళ్ల సీజన్‌తో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర అమాంతం పెరిగింది. బుధవారం నాటి మార్కెట్లో రూ. 225 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 32,450కి చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ తగ్గినప్పటికీ దేశీయ కొనుగోళ్లతో ధర పెరిగిందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. నేటి మార్కెట్లో రూ. 200 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 40,700కు చేరింది.