Short News

రామాలయాన్ని మన ముస్లీంలు కూల్చలేదు: ఆరెస్సెస్ భాగవత్

రామాలయాన్ని మన ముస్లీంలు కూల్చలేదు: ఆరెస్సెస్ భాగవత్

భారత్‌కు చెందిన ముస్లీంలు అయోధ్యలోని రామాలయాన్ని కూల్చలేదని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) మోహన్ భాగవత్ అన్నారు. ఆయన పల్‌ఘర్ జిల్లాలో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ఆదివారం మాట్లాడారు. భారత్‌కు చెందిన జాతీయవాదులు అలాంటి పనులు చేయరని, అందుకే భారతీయ ముస్లీంలు రామాలయాన్ని కూల్చలేదని ఆయన వ్యాఖ్యానించారు. విదేశీ శక్తులు ఆ ఆలయాన్ని కూల్చేశాయని వ్యాఖ్యానించారు. భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారన్నారు.

అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర పోషించడం చాలా కష్టంగా ఉందన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్'లో ఆయన మన్మోహన్‌సింగ్ పాత్రను పోషిస్తున్నారు. తాను ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు మన్మోహన్‌సింగ్ చరిత్రను అధ్యయనం చేశానని తెలిపారు. ఎంతో కష్టమైన పాత్రను పోషిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర పోషించడం తన సినీ కెరీర్ లో సవాల్ గా నిలిచిందన్నారు అనుపమ్‌ఖేర్.  
కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 28 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్‌4లోపు పంపించాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్‌ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.