Short News

బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. నామినేషన్ వెయ్యడానికి గాలి బ్రదర్

బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. నామినేషన్ వెయ్యడానికి గాలి బ్రదర్

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారి నియోజక వర్గం బీజేపీ టిక్కెట్ ఎవ్వరికి అనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. బళ్లారి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బళ్లారి శాసన సభ నియోజక వర్గం టిక్కెట్ తనకు వస్తుందో ? లేదో ? అనే ఒత్తిడిలో మొదట గాలి సోమశేఖర్ రెడ్ది ఉన్నారు. అయితే బీజేపీ నుంచి మరో వ్యక్తి బీజేపీ స్క్రీనింగ్ కమిటీ ముందు అర్జీ సమర్పించకపోవడంతో గాలి సోమశేఖర్ రెడ్డి కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్‌ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సల్స్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్‌ షెలార్‌ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం ఆరుగురు మరణించారని చెప్పారు.

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

'సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌(రాజ్యాంగ పరిరక్షణ)' ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ సవాలు విసిరారు రాహుల్. రాహుల్‌ గాంధీ సోమవారం 'సేవ్‌ ది కన్‌స్టిట్యూషన్‌' కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ' ప్రధాని మోడీ నన్ను పార్లమెంటులో ఎదుర్కోలేరు. నాతో కనీసం 15 నిమిషాల పాటు చర్చకు కూడా ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఆయన దృష్టంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంది. మోడీజీ నాతో చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ రాహుల్ గాంధీ సవాల్‌ విసిరారు.

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి లోకేష్‌కు టెక్నాలజీపై మంచి పట్టుందని చెప్పారు. మ‌న ఐటీ మంత్రి ప్రొఫెషనల్‌ అని, ఐటీలో లోకేష్‌కు మంచి పట్టుందని చెప్పారు. తాను మేనేజర్, లీడర్‌ను మాత్రమేనని.. సూచనలు ఇస్తుంటానని చెప్పారు. సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఐటీ వేదికగా నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.