Short News

ప్రపంచంలో 11 నగరాలకు తాగునీటి సమస్య, బెంగళూరు సెకండ్, బీబీసీ, జార్జ్ ఫైర్. పరువు!

ప్రపంచంలో 11 నగరాలకు తాగునీటి సమస్య, బెంగళూరు సెకండ్, బీబీసీ, జార్జ్ ఫైర్. పరువు!

ప్రపంచంలోని 11 మహానగరాలకు తాగునీటి సమస్య ఎదురౌతుందని బీబీసీ న్యూస్ బాంబు పేల్చింది. ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం రెండో స్థానంలో ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. అయితే ఎలాంటి తాగునీటి సమస్య ఎదురుకాదని, ప్రజలకు కావాలసిన నీరు సరఫరా చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని బెంగళూరు నగర అభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్ అంటున్నారు. బీబీసీ న్యూస్ కథనంపై మంత్రి కేజే. జార్జ్ మండిపడుతున్నారు.

మత్తయ్య చెప్పిన అసలు నిజాలు?.., తెర వెనుక ఇంత జరిగిందా?

మత్తయ్య చెప్పిన అసలు నిజాలు?.., తెర వెనుక ఇంత జరిగిందా?

అప్పట్లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. ఆ తర్వాత మారుతూ వచ్చిన రాజకీయ సమీకరణాల రీత్యా తెరమరుగవుతూ వచ్చింది. రాజకీయాలు అసలు నిందితులను తప్పిస్తే.. మధ్యవర్తిగా ఉన్న తానే దోషిగా ఇరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని నిందితుడు జెరూసలెం మత్తయ్య వాపోతున్నాడు.ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పార్టీ ఇన్‌ పర్సన్‌ (న్యాయవాదితో సంబంధం లేకుండా)గా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరడం గమనార్హం.

నీరవ్ మోడీ కుంభకోణం: పెదవి విప్పిన ప్రధాని  మోడీ

నీరవ్ మోడీ కుంభకోణం: పెదవి విప్పిన ప్రధాని మోడీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకుల్లో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. నీరవ్ మోడీ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఆయన తొలిసారి ఆ విషయంపై శుక్రవారం పెదవి విప్పారు.ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు. ఆర్థిక అక్రమాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎకనమిక్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.ఆ విధమైన అక్రమాలను నివారించడంలో ఉన్నత స్థాయి యాజమాన్యం, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ కీలకమైన పాత్ర పోషించాలని ఆయన అన్నారు.
జ్యోతిరాదిత్య భవిష్యత్.. చౌహాన్ సర్కార్ ప్రతిభకు గీటురాయి

జ్యోతిరాదిత్య భవిష్యత్.. చౌహాన్ సర్కార్ ప్రతిభకు గీటురాయి

మధ్యప్రదేశ్‌లోని శనివారం పోలింగ్ జరుగుతున్న రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల సాధారణ మనోభావాలను తెలియజేయనున్నాయి. ఇప్పటికే రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అపప్రధ మూటకట్టుకున్న శివరాజ్ సింగ్ సర్కార్ పనితీరుకు ఈ ఫలితాలు కీలకం అవుతాయి.సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. ఈ స్థానాల్లో గెలుపొందితేనే కాంగ్రెస్ పార్టీలో సింధియా తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు.