Short News

బిచ్చమెత్తి మరీ మరుగుదొడ్డి కట్టించిన మహిళ!

బిచ్చమెత్తి మరీ మరుగుదొడ్డి కట్టించిన మహిళ!

బీహార్‌లోని పత్రా ఉత్తర్‌కి చెందిన అమినా ఖాతూన్ అనే మహిళ భర్త చనిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తోంది. మరుగుదొడ్డి కోసం అధికారులకు దరఖాస్తు పెట్టుకుంది. రోజూ ఆఫీసు చుట్టూ తిరిగింది. అయినా అధికారులు స్పందించలేదు. ఎలాగైనా మరుగుదొడ్డి నిర్మించి తీరాలని భావించిందామె. సమీప గ్రామాల్లో బిచ్చమొత్తుకొని... పైసా పైసా కూడబెట్టింది. మరుగుదొడ్డి నిర్మాణానికి సరిపడా డబ్బులు వచ్చాక... స్వగ్రామంలో పనిమొదలు పెట్టింది. ఎట్టకేలకు మరుగుదొడ్డిని నిర్మాణాన్ని పూర్తి చేసింది.

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు నేడు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపర్ల అప్రమత్తతో ఆరంభం నుంచే సూచీలు నష్టాల బాట పట్టాయి. మార్కెట్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకు పైగా కోల్పోయింది.  సెన్సెక్స్‌ 28 పాయింట్ల స్వల్ప నష్టంతో 34,589 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 10,603 వద్ద ట్రేడవుతున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్‌ మహింద్రా, విప్రో తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.
గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై  మైనర్ అత్యాచారం

గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై మైనర్ అత్యాచారం

మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చినా కానీ, ఈ తరహ ఘటనలు మాత్రం ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో నిర్భయ తరహ ఘటన చోటు చేసుకొంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒంటరి మహిళను చూసి బాధితురాలిపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో ఈ ఘటన చోటు చేసుకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

డాక్టర్లకు బిపి పెంచుతున్న..."వీరమాచినేని డైట్ ప్లాన్

డాక్టర్లకు బిపి పెంచుతున్న..."వీరమాచినేని డైట్ ప్లాన్

పేషెంట్లకు మేలు సంగతేమో కానీ తెలుగు డాక్టర్లకు బిపి పెంచుతోంది "వీరమాచినేని డైట్ ప్లాన్"...కారణం ఇటీవలి కాలంలో తమ దగ్గరకు వస్తున్న సగం మందికి పైగా ఈ డైట్ గురించే ఆరాలు తీస్తుండటమే...అసలు కొందరైతే రోగం గురించి కాకుండా ఈ కీటో డైట్ గురించి తమ సందేహాలు తీర్చుకునేందుకే ఫీజులు కట్టి ఒపీలు రాయించుకొని మరీ డాక్టర్ల దగ్గరకు వస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపిలో తెలుగు పేషెంట్ల నోటి నుంచి వచ్చే ఒక ప్రశ్న అల్లోపతి డాక్టర్లకు అస్సలు నచ్చడం లేదు...ఆ కొచ్చెన్ ఏంటంటే..."సార్‌..! వీరమాచినేని డైట్ ప్లాన్ వాడమంటారా?"...