Short News

వారిద్దరూ రేపిస్టులకు అనుకూలం కాదు: రామ్ మాధవ్

వారిద్దరూ రేపిస్టులకు అనుకూలం కాదు: రామ్ మాధవ్

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుండి వైదొలిగిన ఇద్దరు బిజెపి మంత్రులు తప్పు చేసినట్టు కాదని , ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీ రామ్‌మాధవ్ అభిప్రాయపడ్డారు. కొన్ని సమయాల్లో విచక్షణ పాటించకపోవడమంటే తప్పు చేసినట్టు కాదన్నారు. అయితే కాశ్మీర్ ప్రభుత్వం నుండి వైదొలిగిన ఇద్దరు మంత్రులను అపార్ధం చేసుకోవడానికి అదే కారణమని ఆయన చెప్పారు.ఎనిమిదేళ్ళ మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్ , హత్య చేసిన ఘటన తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు రామ్‌మాధవ్ శ్రీనగర్‌లో మకాం వేశారు.

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

ముంబైలో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. మహ్మద్‌ ఫరూక్‌ అలియాస్‌ ఫరూక్‌ షేక్‌ అనే వ్యక్తి దాదాపు రూ.2,253 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ నివారణ చట్టం కింద ఫరూక్‌ను అధికారులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించడానికి ఫరూక్‌ 13 కంపెనీలను వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతన్ని ఏప్రిల్‌ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది.
మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమాలో నటించిన నటీనటుల పాత్రలు త్వరలో పోస్టర్స్ ద్వారా విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మే ఒకటిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ''తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే కథ మహానటి సావిత్రి కథ''. తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది.

క్యాన్సర్‌తో భాదపడుతున్న నటి, మెగాస్టార్ సాయం.. స్వయంగా ఇంటికి వెళ్లిన చిరు కుమార్తె శ్రీజ!

క్యాన్సర్‌తో భాదపడుతున్న నటి, మెగాస్టార్ సాయం.. స్వయంగా ఇంటికి వెళ్లిన చిరు కుమార్తె శ్రీజ!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. ఆపదలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సాయమా అందించే స్వభావం చిరంజీవి సొంతం. సీనియర్ నటి సుభాషిణి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బదపడుతున్నారు. ఆమె పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి ఆమెని పరామర్శించడం విశేషం. సుభాషిణి ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రీజ రూ 2 లక్షల ఆర్థిక సాయం అందజేయడం విశేషం.