Short News

ప్రియాంకను ట్యాగ్ చేసి పప్పులో కాలేసిన కాంగ్రెస్

ప్రియాంకను ట్యాగ్ చేసి పప్పులో కాలేసిన కాంగ్రెస్

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మరోసారి పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక ఛతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. భూ పరీక్షల ల్యాబ్‌ల గురించి ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెబుతున్నారని, రైతులకు ఆయా ల్యాబ్‌ల నుంచి ఇస్తున్న భూ పరీక్ష రిపోర్టులు తప్పనే ఆరోపణలు చేస్తూ గురువారం ట్వీట్ చేసి ప్రియాంకకు ట్యాగ్ చేసింది. వెంటనే తన పొరపాటును తెలుసుకున్న కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది.

'జిగేలు రాణి' సింగర్ ఆవేదన.. పాడినందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు, మోసం!

'జిగేలు రాణి' సింగర్ ఆవేదన.. పాడినందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు, మోసం!

వేసవిలో విడుదలైన రాంచరణ్ రంగస్థలం చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా, బాహుబలి తరువాత టాలీవుడ్ లో అంతటి ఘనవిజయంగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని టాలీవుడ్ గొప్ప చిత్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్రకు అర్థవంతమైన ప్రాధాన్యత ఇచ్చారు. దేవిశ్రీ సంగీతం కూడా అద్భుతంగా అలరించింది. సుకుమార్ చిత్రాలలో ఐటమ్ సాంగ్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

పీఎన్‌బీ కుంభకోణం: మెహుల్ చోక్సీ అమెరికాలో లేడు

పీఎన్‌బీ కుంభకోణం: మెహుల్ చోక్సీ అమెరికాలో లేడు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చోక్సి అమెరికాలో లేడని తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కోసం ప్రపంచ వ్యాప్తంగా గాలిస్తున్నారు భారత ఇంటర్ పోల్ అధికారులు. వారిద్దరిన్నీ పట్టుకోవడానికి ప్రతి ఒక్క​ దేశం భారత్‌కు, సాయపడుతోంది. తమ దేశంలో ఏమైనా నక్కి ఉన్నారేమోనని వెతుకులాట చేపట్టిన ఇంటర్‌ పోల్‌ వాషింగ్టన్‌, మెహుల్‌ చోక్సి తమ దేశంలో లేడంటూ క్లారిటీ ఇచ్చింది. గత బుధవారం భారత్‌ పంపిన అభ్యర్థనకు ఇంటర్‌పోల్‌ వాషింగ్టన్ స్పందించింది.
గో ఎడిషన్‌లో Moto E5 Play, ధర ఎంతంటే?

గో ఎడిషన్‌లో Moto E5 Play, ధర ఎంతంటే?

లెనోవో నేతృత్వంలోని మోటరోలా కొద్ది రోజుల క్రితం తన E అలానే G సిరీస్‌ల నుంచి 6 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో మూడు ఫోన్‌లను మోటో ఇ సిరీస్ నుంచి మోటరోలా అందుబాటులో ఉంటుంది. మోటో ఇ5, మోటో ఇ5 ప్లస్, మోటో ఇ5 ప్లే పేర్లతో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మోటో ఇ5 ప్లే మోడల్‌ను తాజాగా లాటిన్ అమెరికా ఇంకా యూరోప్ మార్కెట్లలో మోటరోలా లాంచ్ చేసింది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more