Short News

మైమ‌ర‌పించే గానం.. కురిపిస్తుంది క‌రెన్నీ వ‌ర్షం

మైమ‌ర‌పించే గానం.. కురిపిస్తుంది క‌రెన్నీ వ‌ర్షం

గుజరాత్‌లో ఓ గాయ‌కుడిపై శ్రోత‌ల‌కు ఉన్న అభిమానం క‌రెన్సీ వ‌ర్ష‌మై కురుస్తోంది. ఇటీవ‌ల నవ్‌సారిలో గాయకుడు క్రితిదన్‌ గాడ్వి గొంతు సవరించుకున్నాడో లేదో సభికుల నుంచి నోట్లు వేదికపై వెల్లువెత్తాయి. హార్మోనియం వాయిస్తూ గాడ్వి పాడుతున్నంత సేపూ ప్రేక్షకులు నోట్లు విసరడంతో వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. గాడ్వి ప్రదర్శనల్లో ఇలాంటివి మామూలేనని ఆయన అభిమానులు వెల్ల‌డించారు. గతం‍లోనూ ఆయన ప్రదర్శనకు మైమరిచిన ప్రేక్షకులు నోట్లు విసిరి తమ సంతోషం వ్యక్తపరిచార‌ని వారు తెలిపారు.   
‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్  నటిస్తే బాగుంటుంది

‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్ నటిస్తే బాగుంటుంది

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తన బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' చిత్రంతో నటుడిగా మారారు. అయితే ఈ సినిమాలో సచిన్‌ నటన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌కి కూడా తెగ నచ్చేసినట్టుంది. సచిన్‌ అమెరికన్‌ సూపర్‌హీరో సిరీస్ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌' ‌లో నటిస్తే బాగుంటుందని బెనెడిక్ట్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్‌లో బెనెడిక్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బెనెడిక్ట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్' చిత్రం భారత్‌లో ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా మరో మారు వాయిదా పడి జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 కూడా విడుదల కావలసి ఉంది. 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన స్టంట్స్ కోసం 40 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారట.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎయిరిండియా బోయింగ్ విమానం ప్రయాణికులను బెంబెల్లెత్తించింది. విమానంలోని విండో ప్యానెల్ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.15 నిమిషాల పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఓవర్ హెడ్ ప్యానెల్‌కు తల బలంగా తాకిన ప్రయాణికుడికి కుట్లు పడినట్టు చెప్పారు.