Short News

100 నగరాల్లో కాలుష్య నివారణకు చర్యలు

100 నగరాల్లో కాలుష్య నివారణకు చర్యలు

కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వంద నగరాల్లో అత్యవసర కాలుష్య నిరోధక కార్యక్రమాలు చేపట్టాలని  నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర పర్యావరణ శాఖ జాతీయ పరిశుద్ధ గాలి కార్యక్రమాన్ని చేపట్టనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 5 నగరాలున్నాయి. మరోవైపు మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించేందుకు 1000కోట్లతో ప్రణాళికను రూపొందించింది.
మహేష్ బాబు తో కలిసి సినిమా చూసిన కేటీఆర్

మహేష్ బాబు తో కలిసి సినిమా చూసిన కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ భరత్ అనే నేను చిత్రాన్ని టీంతో కలిసి స్పెషల్ ప్రీమియర్ చూశారు. సినిమా బాగా నచ్చడంతో తన ట్విట్టర్ లో మహేష్ మరియు కొరటాల శివని అభినందించారు. సినిమా చాలా ఎంజాయ్ చేశానని స్నేహితుడు మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో ఇంటరాక్షన్ జరిపినట్టు కేటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.ఓ మంచి కాజ్ కోసం కేటీఆర్ తొలి సారి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సమాచారం.విలువైన సమయాన్ని కేటాయించి, 'భరత్ అనే నేను' సినిమాను చూసినందుకు, తమ ప్రయత్నాలను ప్రశంసించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
సభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఫైర్

సభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఫైర్

ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు చాలా బాధాకరం అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పురంధేశ్వరి కర్నాటకలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాజ్యాంగబద్ధమైన దేశ ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీపై అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని సభ్య సమాజం ఆమోదించదని చెప్పారు. అనంతరం కర్నాటక ఎన్నికలపై మాట్లాడారు.

విశాఖ జిల్లాలో ప‌డ‌గ విప్పుతున్న ఆంత్రాక్స్‌!

విశాఖ జిల్లాలో ప‌డ‌గ విప్పుతున్న ఆంత్రాక్స్‌!

విశాఖ మన్యంలో మరో నలుగురికి ఆంత్రాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ గెంజిగెడ్డలో నలుగురికి చేతులకు పుళ్లు పడటంతో వైద్య సిబ్బంది హుటాహుటిన చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంత్రాక్స్‌పై సమీక్ష నిర్వహిస్తుండగానే ఈ విషయం బయటపడటంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. గిరిజన ప్రాంతంలో ఆంత్రాక్స్‌ వ్యాప్తిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. నిన్న గూడెం కొత్తవీధి దామనాలపల్లి మాడెంలో ఏడుగురు ఆంత్రాక్స్‌ బాధితులను వైజాగ్‌ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.