Short News

''ఆ కేసులో తీర్పు వచ్చిన వెంట‌నే ప్ర‌భుత్వం గ‌ల్లంత‌వుతుంది''

''ఆ కేసులో తీర్పు వచ్చిన వెంట‌నే ప్ర‌భుత్వం గ‌ల్లంత‌వుతుంది''

‘అనర్హత' ఎమ్మెల్యేల కేసులో తీర్పు వచ్చిన వెంటనే త‌మిళ‌నాట పళనిస్వామి ప్రభుత్వం గల్లంతవుతుందని అమ్మా మక్కళ్‌ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్కే నగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ జోస్యం చెప్పారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో తమిళనాడనే రాష్ట్రం ఉందనే విషయాన్ని మోదీ మర్చిపోయినట్టు తమిళులు భావించాల్సిన పరిస్థితి ఏర్పడిందని దిన‌క‌ర‌న్ విమర్శించారు. కావేరి వ్యవహారంలో అంతా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారని, అలాగని కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత లేదన్నారు.   
రాజ్యస‌భ సెక్ర‌టేరియ‌ట్ లో ఆక‌స్మిక త‌నిఖీలు

రాజ్యస‌భ సెక్ర‌టేరియ‌ట్ లో ఆక‌స్మిక త‌నిఖీలు

రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇవాళ రాజ్యసభ సెక్రటేరియట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. అధికారులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెడుతూ పలు సూచనలు చేశారు. పార్లమెంటు అనుబంధ కార్యాలయాల్లో ఈ తరహా తనిఖీలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాజ్యసభ ఛైర్మన్ ఇలా తనిఖీలు చేపట్టడం కూడా ఎప్పుడూ జరగలేదని సెక్రటేరియట్‌లోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. తనిఖీల అనంతరం వెంకయ్య నాయుడు సెక్రటేరియట్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.    
లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్‌లో సానుకూల సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. రిఫైనరీ, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌, ఆటో, బ్యాంకింగ్‌ రంగంలో షేర్లు లాభపడటంతో సూచీలు లాభపడ్డాయి. ఉదయం వందకు పైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ లాభాల జోరు కొనసాగించింది. చివరకు 165.87 పాయింట్ల లాభంతో 34,616.64 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 29.65 పాయింట్ల లాభంతో 10614.35 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.37వద్ద ట్రేడవుతోంది.   
మూడోసారి తండ్రైన బ్రిట‌న్ రాకుమారుడు

మూడోసారి తండ్రైన బ్రిట‌న్ రాకుమారుడు

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ దంపతులకు సోమవారం కుమారుడు జన్మించినట్లు కెన్సింగ్‌టన్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటు కొన్ని ఫొటోలు కూడా విడుద‌ల చేసింది. ఇప్పటికే ఈ దంపతులకు ఒక బాబు(ప్రిన్స్‌ జార్జి), పాప(ప్రిన్సెస్‌ ఛార్లెట్‌)ఉన్నారు. తాతయ్య ప్రిన్స్‌ ఛార్లెస్‌, తండ్రి ప్రిన్స్ విలియమ్స్‌, సోదరుడు ప్రిన్స్‌ జార్జి, అక్క ప్రిన్సెస్‌ ఛార్లెట్‌ తర్వాత రాజ సింహాసనానికి ఈ నవజాత శిశువుకు వారసుడయ్యే హక్కు ఉంది.