Short News

రంజాన్ నెల‌లో ఉగ్ర‌వాదుల గాలింపు వ‌ద్దు

రంజాన్ నెల‌లో ఉగ్ర‌వాదుల గాలింపు వ‌ద్దు

'రంజాన్' మాసంలో గాలింపు చర్యలు చేపట్టవద్దని జమ్మూ కశ్మీర్‌లోని భద్రతా బలగాలకు కేంద్రం సంచలన ఆదేశాలిచ్చింది. అయితే దాడులు జరిగినప్పుడు, అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాల్సి వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టే హక్కు భద్రతా బలగాలకు ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. రంజాన్ మాసంలో భద్రతా బలగాల ఆపరేషన్లు నిలిపివేయాలని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ కేంద్రాన్ని కోరిన అనంత‌రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
జడేజా భార్య జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్

జడేజా భార్య జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా కారు ఒక కానిస్టేబుల్‌ బైక్‌ను స్వల్పంగా ఢీకొంది. సరు సెక్షన్‌ రోడ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఆ కానిస్టేబుల్‌ రీవాను జుట్టు పట్టిలాగి దుర్భాషలాడాడు. కానిస్టేబుల్‌ జడేజా భార్యపై చేయిచేసుకొని దుర్భాషలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారమందిన అక్కడికి చేరుకున్న పోలీసులు రీవాను నివాసానికి పంపి వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ వెల్లడించారు.  
మద్యం మత్తులో కారుని ఢీ కొట్టిన ప్రముఖ డైరెక్టర్.. క్షణాల్లో మాయం, హీరో బర్త్ డే పార్టీ నుంచి వస్తూ!

మద్యం మత్తులో కారుని ఢీ కొట్టిన ప్రముఖ డైరెక్టర్.. క్షణాల్లో మాయం, హీరో బర్త్ డే పార్టీ నుంచి వస్తూ!

టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) మద్యం మత్తులో తన కారుతో మరో కారుని ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబీ ప్రతిభావంతుడైన యువ దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే బాబీ ఎదుగుతున్నాడు. తన కారుని ఢీ కొట్టి బాబీ పరారయ్యాడని బాధితుడు సోషల్ మీడియా ద్వారా ఆరోపించాడు. బాబీ రచయితగా ప్రతిభ గల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా తన తొలి చిత్రం పవర్ తో విజయాన్ని అందుకున్నాడు.

ఈ వారం రాశి ఫలాలు మే21 నుండి మే27 వరకు.

ఈ వారం రాశి ఫలాలు మే21 నుండి మే27 వరకు.

రాశి ఫలాల ఆధారంగా ఈ వారం మీ జీవితంలో ఎదురయ్యే లాభ నష్టాల గురించి తెలుసుకోండి :

మనలో అధిక భాగం రాశి ఫలాలలో దినఫలాల కన్నా వార ఫలాల మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటారు. క్రమంగా వారంలో ఎదురయ్యే లాభ నష్టాల మీద అంచనాలతో ప్రణాళికలను ఏర్పరచుకుంటూ ఉంటారు.

ఈ వార ఫలాలు మొత్తం వారంలో మీ రాశిచక్రం గురించిన వివరాలను తెలియజేస్తాయి. ఈ రాశి ఫలాలు వారంలో మనం తీసుకునే నిర్ణయాల లాభనష్టాల గురించి వెల్లడిస్తుంది. మరియు ఒక కొత్త వ్యాపారo ప్రారంభించడానికి ఉత్తమ సమయాన్నితెలియజేస్తుంది .