Short News

ప్రేమికుల రోజుకు నిరసనగా కుక్కకు గాడిదకు పెళ్లి

ప్రేమికుల రోజుకు నిరసనగా కుక్కకు గాడిదకు పెళ్లి

ప్రేమికుల రోజును కొందరు వ్యతిరేకిస్తున్నారు.మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ప్రేమికుల రోజుకు మద్దతుగా కర్ణాటకలో రెండు గొర్రెలకు పెళ్లి చేస్తే... చెన్నైలో మాత్రం వాలంటైన్స్ డేకు నిరసనగా కుక్కకు గాడిదకు పెళ్లి చేశారు భారత్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు.. వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా కుక్కకు,గాడిదకు పూల దండలు వేసి వివాహం జరిపించారు. హిందూ సంప్రదాయ ప్రకారం మహిళలు పెళ్లి చేశారు. ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.
అవిశ్వాసంతో ప్రయోజనం లేదన్న చంద్రబాబు

అవిశ్వాసంతో ప్రయోజనం లేదన్న చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఏపీలో పోలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆవిశ్వాసం పెడితే టీడీపీకి మద్దతిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మరోవైపు  అవిశ్వాసం కోసం తాను కూడా  ఎంపీల మద్దతు కూడగడతానని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాన్. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు అవిశ్వాసంతో ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే ఉండాలన్నారు.
లేటుగా వచ్చిన పైలట్, బయటకు చెప్తే విమానం పేల్చేస్తా

లేటుగా వచ్చిన పైలట్, బయటకు చెప్తే విమానం పేల్చేస్తా

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోఎయిర్ సంస్థకు చెందిన జీ8 113 విమానం ఉదయం 5.50కి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులు వచ్చినా పైలట్లు 7గంటల వరకు పైలట్లు విమానం వద్దకు రాలేదు. కనీసం విమానం కదులుతుందో లేదో తెలియక కొందరు ప్రయాణికులు కేకలు వేశారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కొందరు వారిని వీడియో తీశారు. పైలట్లు వద్దని చెబుతున్నా సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదరించారు. వీడియోలు పోస్టు చేస్తే విమానాన్ని దారిమధ్యలోనే పేల్చేస్తారట అని ఓ ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది.
అందుకే ఇలా: జగన్ పార్టీపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు, బాబుకు చురక

అందుకే ఇలా: జగన్ పార్టీపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు, బాబుకు చురక

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైన ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఆ పార్టీ చిత్తశుద్ధితో పోరాడలేకపోయిందని విమర్శించారు. ఆయన ఓ వెబ్ సైట్ ముఖాముఖిలో మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోలేకపోయిందని తమ్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఏపీకి చేసింది ఏమీ లేదన్నారు.