Short News

కలెక్టర్ రోహిణి సింధూరికి ఈసీ క్లీన్‌చిట్‌

కలెక్టర్ రోహిణి సింధూరికి ఈసీ క్లీన్‌చిట్‌

కర్ణాటకలోని హాసన్‌ జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరికి రాష్ట్ర ఎన్నికల అధికారులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. రోహిణిపై మంత్రి ఏ.మంజు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.  హాసన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రావటంతో తహశీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరి ఫిర్యాదులు పరిశీలించిన ఎన్నికల కమీషన్ రోహిణికి క్లీన్ చిట్ ఇచ్చింది.
వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

యువతి,యువకుడికి వాట్సప్ పెళ్లి చేసింది.అవును నిజం. అయితే వీరిద్దరికి మాటలురావు, చెవులు వినిపించవు. వారిద్దరి పరిచయం వాట్సప్‌ ద్వారా జరిగింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు.  ప్రైవేటు కంపెనీలో ఇద్దరి జాబ్ చేస్తుండగా వాట్సప్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆదివారం బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు,స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకన్నారు.
బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌ని తీసుకోవాల‌ని నిర్వాహకులు భావిస్తున్నార‌ట‌. మాజీ ప్రేమికులైన వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబ‌ట్టి, ఇద్దరు క‌లిసి షో చేస్తే మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారట. బిగ్‌బాస్‌ సీజ‌న్‌12 కి కూడా స‌ల్మాన్‌ని హోస్ట్‌గా ఎంపికైతే తొమ్మిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు.
సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

అమరావతి: సెక్స్‌వర్కర్లకు పునరావాసం కోసం ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని పలువురు సామాజిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
మానవ అక్రమ రవాణాపై సోమవారం సచివాలయంలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత పర్యవేక్షణలో ఈ వర్క్ షాప్ నిర్వహణ జరిగింది.