Short News

బెంగళూరులోని జయనగర ఎన్నికల డేట్ ఫిక్స్, సీఎం యడ్యూరప్ప !

బెంగళూరులోని జయనగర ఎన్నికల డేట్ ఫిక్స్, సీఎం యడ్యూరప్ప !

బెంగళూరు నగరంలోని జయనగర శాసన సభ నియోజక వర్గం ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జయనగర బీజేపీ శాసన సభ్యుడు బిఎన్. విజయ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆ నియోజక వర్గం ఎన్నికలు వాయిదా పడ్డాయి. జయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి కర్ణాటక మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే జయనగరలో బీజేపీ ఇంత వరకు అధికారికంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఈ చిరునవ్వుల కోసమే 24 గంటలుగా నిద్రపోలేదు

ఈ చిరునవ్వుల కోసమే 24 గంటలుగా నిద్రపోలేదు

శనివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ ఉత్కంఠభరిత విజయంపై కోల్‌కతా ఫ్రాంఛైజీ సహయాజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ చిరునవ్వులు చూసేందు కోసమే 24 గంటలుగా మెలకువతోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇక నిద్రపోలేను అని ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, నరైన్ నవ్వుతున్న ఫొటోలను షేర్ చేశాడు.
వైయస్ ఉన్నప్పుడు రమణదీక్షితులు మాట్లాడలేదేం: టీటీడీ చైర్మన్

వైయస్ ఉన్నప్పుడు రమణదీక్షితులు మాట్లాడలేదేం: టీటీడీ చైర్మన్


మణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం స్పందించారు. దీక్షితులు ఆరోపణలు సరికాదన్నారు. ఆయనపై టీటీడీకి ఎలాంటి కక్ష సాధింపు లేదని చెప్పారు. గతంలో ఎప్పుడూ చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు భక్తుల సేవకే గానీ పెత్తనానికి కాదన్నారు. రమణ దీక్షితులే కాదని, సామాన్య భక్తులు కూడా తీసుకు వచ్చిన అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి - కరుణాకర్ రెడ్డి హయాంలో రమణదీక్షితులు ఎందుకు మాట్లాడలేదన్నారు.

ఎన్టీఆర్‌ని నలిపేస్తున్న రాంచరణ్.. అద్భుతమైన రీతిలో బర్త్ డే విషెష్!

ఎన్టీఆర్‌ని నలిపేస్తున్న రాంచరణ్.. అద్భుతమైన రీతిలో బర్త్ డే విషెష్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో అభిమానులు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ తరచుగా కలుసుకుంటున్నారు. ఒకరి సినిమాల విషయంలో మరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక. అభిమానులు భారీస్థాయిలో ఎన్టీఆర్ పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్టీఆర్ కు వెల్లువలా వస్తున్నాయి.