Short News

ఎప్పుడంటే అప్పుడు 'పీఎఫ్' విత్‌డ్రా చేసుకోవచ్చు

ఎప్పుడంటే అప్పుడు 'పీఎఫ్' విత్‌డ్రా చేసుకోవచ్చు

పీఎఫ్‌ ఖాతాల నుండి నగదును విత్‌డ్రా చేసుకోవడం సులభతరం కానుంది. ఖాతాదారులు తమ అకౌంట్లను ముందస్తుగా క్లోజ్‌ చేసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇప్పటివరకూ పీపీఎఫ్ అకౌంట్లను ఐదేళ్ళు పూర్తి కాకుండా మూసివేయడం కుదరదు. కానీ  కొత్త విధానంలో ఎప్పుడు కావాలంటూ అప్పుడు, గడువు ముగియక ముందే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి వీలుగా చట్టాలపై సవరణలు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 
గవర్నర్ పేరు తొలగిస్తేనే విచారణ: పిటిషన్ విచారణపై హైకోర్టు

గవర్నర్ పేరు తొలగిస్తేనే విచారణ: పిటిషన్ విచారణపై హైకోర్టు

వేరే పార్టీ టికెట్ పై గెలిచి.. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మంత్రి అఖిలప్రియలను బాధ్యతల నుంచి నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గవర్నర్ నరసింహన్‌ను ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.

గవర్నర్ ప్రతివాదిగా ఉన్న పిటిషన్లను విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గత తీర్పును ప్రస్తావించింది. ఆ మేరకు గవర్నర్‌ను ప్రతివాదిగా చేయడానికి వీల్లేదని తెలిపింది.

వణుకు పుట్టిస్తోన్న 'పార్థీ' గ్యాంగ్: పోలీసుల అలర్ట్

వణుకు పుట్టిస్తోన్న 'పార్థీ' గ్యాంగ్: పోలీసుల అలర్ట్

ఏపీలో పార్థీ గ్యాంగ్ సంచరిస్తుందన్న వార్త ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలోని అత్యంత నేరపూరిత గ్యాంగుల్లో ఒకటైన ఈ గ్యాంగ్.. ప్రస్తుతం చిత్తూరు-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తోందని పోలీసులకు సమాచారం అందింది.

రాత్రివేళల్లో ఒంటికి ఒండ్రుమట్టి, నూనె రాసుకుని చోరీలు, దోపిడీలకి పాల్పడుతుంటారు పార్థీ గ్యాంగ్ సభ్యులు. ఆ క్రమంలో ఇంట్లోవాళ్లు ఎవరైనా తిరగబడితే.. నిర్దాక్షిణ్యంగా వారిని హత్య చేస్తారు. అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు అనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

దంపతులపై కాల్పులకు తెగబడ్డ దుండగులు: ఎవరై ఉంటారు?

దంపతులపై కాల్పులకు తెగబడ్డ దుండగులు: ఎవరై ఉంటారు?

బైక్‌పై వెళ్తున్న దంపతులపై కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.పెనుమంట్ర మండలం మార్టేరు వద్ద నాటు తుపాకులతో కొంతమంది వారిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

కాల్పుల సమయంలో.. భర్త శ్రీనివాసరెడ్డి పారిపోగా, భార్య ధనలక్ష్మిపై దుండగులు హత్యాయత్నం చేశారు. శ్రీనివాస రెడ్డి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు హుటాహుటిన అక్కడికి వచ్చారు.దీంతో దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం ధనలక్ష్మిని విజయవాడధనలక్ష్మిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.