Short News

తీగ‌ల నుంచి మంట‌లు.. సొరంగంలో ఆగిపోయిన‌ మెట్రో

తీగ‌ల నుంచి మంట‌లు.. సొరంగంలో ఆగిపోయిన‌ మెట్రో

కోల్‌కతాలో ఆదివారం రాత్రి మెట్రో రైల్లో ప్ర‌యాణించిన‌వారికి చేదు అనుభవం ఎదురైంది. రైలు సొరంగ మార్గంలో ప్రయాణించే సమయంలో ఉన్నట్టుండి ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీగల నుంచి పలుమార్లు మంటలు రావడంతో మరింత భయపడిపోయారు. కొందరైతే ఏకంగా రైలు కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు వెళ్లాలని ప్రయత్నించారు. మెట్రోకు సంబంధించిన విద్యుత్‌ లైన్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో రెండు బోగీలు నేతాజీ భవన్‌ మెట్రో స్టేషన్‌ వద్ద సొరంగంలో ఆగిపోయాయి. అయిదు నిమిషాల పాటు తలుపులు కూడా తెరుచుకోలేదు.   
లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్‌లో సానుకూల సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. రిఫైనరీ, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌, ఆటో, బ్యాంకింగ్‌ రంగంలో షేర్లు లాభపడటంతో సూచీలు లాభపడ్డాయి. ఉదయం వందకు పైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ లాభాల జోరు కొనసాగించింది. చివరకు 165.87 పాయింట్ల లాభంతో 34,616.64 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 29.65 పాయింట్ల లాభంతో 10614.35 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.37వద్ద ట్రేడవుతోంది.   
మూడోసారి తండ్రైన బ్రిట‌న్ రాకుమారుడు

మూడోసారి తండ్రైన బ్రిట‌న్ రాకుమారుడు

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ దంపతులకు సోమవారం కుమారుడు జన్మించినట్లు కెన్సింగ్‌టన్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటు కొన్ని ఫొటోలు కూడా విడుద‌ల చేసింది. ఇప్పటికే ఈ దంపతులకు ఒక బాబు(ప్రిన్స్‌ జార్జి), పాప(ప్రిన్సెస్‌ ఛార్లెట్‌)ఉన్నారు. తాతయ్య ప్రిన్స్‌ ఛార్లెస్‌, తండ్రి ప్రిన్స్ విలియమ్స్‌, సోదరుడు ప్రిన్స్‌ జార్జి, అక్క ప్రిన్సెస్‌ ఛార్లెట్‌ తర్వాత రాజ సింహాసనానికి ఈ నవజాత శిశువుకు వారసుడయ్యే హక్కు ఉంది.   
పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్:బొంబాయిలో అంతే...బొంబాయిలో అంతే

పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్:బొంబాయిలో అంతే...బొంబాయిలో అంతే

పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్దం నిరాటంకంగా కొనసాగుతోంది. కొన్ని గంటల క్రితం టిడిపి మద్దతు ఛానెల్స్ కు, విభాగాధిపతులకు, షేర్ హోల్డర్లకు, పెట్టుబడిదారులకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు వెల్లడించిన పవన్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. ప్రముఖ పత్రిక, ఛానెల్ ఎండీని లక్ష్యంగా చేసుకొని ఆయన ఇటీవల రాసిన ఒక కాలమ్ ను ఎద్దేవా చేస్తూ ఈ ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లో చాలా సర్వసాధారణం అని బూతురత్నం అంటున్నాడంటూ...అందుకు ఒక సినిమాలో కమెడియన్ బొంబాయిలో అంతే అనే మేనరిజాన్నివాడిన తీరును పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.