Short News

''క‌థువా అత్యాచార కేసులో ఆ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించండి''

''క‌థువా అత్యాచార కేసులో ఆ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించండి''

కథువా అత్యాచారం కేసు విచారణను చండీగఢ్‌ కోర్టుకు బదలాయించాలని దాఖలైన పిటిషన్‌పై ఈ నెల‌ 27లోగా బదులివ్వాలని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది జనవరిలో లైంగిక దాడి, హత్యకు గురైన చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్దానం ఆదేశించింది. బాధిత బాలిక తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు స్పందించింది.   
మహేస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

మహేస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

మ‌హేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను' బాక్సాఫీస్ దగ్గర వసూళ్లలో రికార్డు సాధిస్తుంది. ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో భారీ ఎత్తున విజ‌యోత్స‌వ వేడుక జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. ఏప్రిల్‌ 27న తిరుపతి అలిపిరి రోడ్డులోని నెహ్రు మున్సిపల్‌ పాఠశాల మైదానంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు ప్ర‌క‌టించారు. కాని ఏపీలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలం లేని నేప‌థ్యంలో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ వాయిదా వేశారు. త్వ‌ర‌లో కొత్త డేట్ మ‌రియు వేదిక వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ప్రకటించారు.
స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..13 మంది చిన్నారులు మృతి

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..13 మంది చిన్నారులు మృతి

ఉత్తర ప్రదేశ్‌ కుశినగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు ఝామున స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యారు.డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వ్యాన్‌ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది.
త్వరలో శాంసంగ్ ‘గెలాక్సీ ఎ8 స్టార్‌’..  ఫీచర్లు ఇవే

త్వరలో శాంసంగ్ ‘గెలాక్సీ ఎ8 స్టార్‌’.. ఫీచర్లు ఇవే

శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ8 స్టార్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇందులో  5.8 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఇందులో అందిస్తున్నారు. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.