Short News

హిందువులు సంయ‌మ‌నం పాటించ‌డం లేదు!

హిందువులు సంయ‌మ‌నం పాటించ‌డం లేదు!

బాబ్రీ మసీదు- రామ జన్మభూమి స్థల వివాదంపై అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో అన్ని వర్గాలూ సంయమనం పాటించాల్సి ఉండగా హిందువుల పక్షం మాత్రం దీనికి కట్టుబడి ఉండడం లేదని సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ ఆరోపించారు. మంగళవారం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఆయన వాదనలు వినిపించారు. సున్నితమైన అంశంపై ప్రజలను పురిగొల్పే రీతిలో హిందువుల పక్షం వ్యవహరిస్తోందని చెప్పారు. దివంగత ముస్లిం నేత ఎం.సిద్ధిఖ్‌ వారసుల తరఫున ఆయన ఈ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.   
మైక్రో మ్యాక్స్ 'భార‌త్ గో' స్మార్ట్ ఫోన్ వ‌చ్చేసింది

మైక్రో మ్యాక్స్ 'భార‌త్ గో' స్మార్ట్ ఫోన్ వ‌చ్చేసింది

దేశీయ మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్ భారత్‌లో తన మొదటి ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్ ఫోన్‌ను ఇవాళ విడుద‌ల‌ చేసింది. 'భారత్ గో' పేరిట విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.4,399 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ అందిస్తున్న మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. 4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ త‌దిత‌ర ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.    
తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, నాగార్జున అక్కినేని కాంబినేష‌న్లో తెర కెక్కిన చిత్రం ఆఫీసర్‌. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చిన్న పాపపై తాను పాటను రూపొందించానని వ‌ర్మ చెప్పారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే..' అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్‌ చెప్పగా, తనదైన స్టైల్‌లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు.   
బంగారి బాలరాజు పాటలు విడుదల చేసిన  నిర్మాత దిల్ రాజు, మంత్రి భూమా అఖిలప్రియ

బంగారి బాలరాజు పాటలు విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు, మంత్రి భూమా అఖిలప్రియ

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోని మరోపాట 'నా కొంగులో నా గుండెలో....' అంటూ సాగే సాంగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. కొత్తవారితో తెరకెక్కిన బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించాలని హీరో, దర్శక నిర్మాతలకు విషెస్ అందించారు.