Short News

సినీ నటిగా గర్వపడుతున్నా: జయాబచ్చన్

సినీ నటిగా గర్వపడుతున్నా: జయాబచ్చన్

సినీ నటిని కావడంతో తాను ఎంతో గర్వపడుతున్నానని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ చెప్పారు. చిత్ర పరిశ్రమలో భాగమైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజ్ వాదీ పార్టీ మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించనందుకు ఆ పార్టీ మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్ బిజెపిలో చేరారు. అంతేకాదు జయాబచ్చన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. సినిమా డాన్సర్‌కు టిక్కెట్టు ఇచ్చారని నరేష్ అగర్వాల్ విమర్శించారు.ఈ విమర్శలకు జయాబచ్చన్ కౌంటర్ ఇచ్చారు. గతంలో కూడ నరేష్ అగర్వాల్ తనపై ఇదే రకమైన విమర్శలు చేశారని జయాబచ్చన్ గుర్తు చేశారు.

వామ్మో..650 మందిని యాసిడ్ లో ముంచి చంపాడు

వామ్మో..650 మందిని యాసిడ్ లో ముంచి చంపాడు

దాదాపు 650 మంది హత్యల కేసులో మెక్సికో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. సినాలోవా డ్రగ్‌ కార్టెల్‌ అనే డ్రగ్స్‌ ముఠాలో పని చేసే సోప్‌ మేకర్‌.. తనకు అడ్డొచ్చిన 650 మందిని యాసిడ్‌లో ముంచి చంపినట్లు వివరించారు. భారీ డ్రమ్ముల్లో యాసిడ్‌ ఉంచి అందులో బాధితులను వేసి మూత పెట్టి అతి క్రూరంగా చంపేవాడని చెప్పారు. అలా బాధితుల శరీరాలు యాసిడ్‌ కరిగిపోగా మిగిలిన పదార్థాలను గుంతల్లో పూడ్చిపెట్టాడని తెలిపారు. 2009లో సోప్‌ మేకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ 240 మంది బాధితుల ఆనవాళ్లను తవ్వి తీశారు.
ప్రభుత్వాలు విఫలం, ఆ ముగ్గురి స్ఫూర్తితో పోరాటం: పవన్

ప్రభుత్వాలు విఫలం, ఆ ముగ్గురి స్ఫూర్తితో పోరాటం: పవన్

స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల స్ఫూర్తితో పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ముగ్గురు పోరాట యోధులను ఏపీ, తెలంగాణ యువత స్మరించుకుంటోందని, ఆర్థికంగా మెరుగైన పరిస్థితుల్ని తీసుకు రావడంలో ప్రభుత్వాలు విఫలం కావడంపై వారి స్ఫూర్తితో జనసేన పోరాడుతుందన్నారు.1931లో ఇదే రోజు మాతృ దేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ బలిదానం చేశారని, బానిస శృంఖలాల నుంచి భారత మాతని విడిపించేందుకు

స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన గంబీర్

స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన గంబీర్

దిల్లీ డేర్‌డెవిల్స్‌ సారథి గౌతమ్‌ గంభీర్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. తన కుటుంబసభ్యులతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 2011 నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గంభీర్‌ ఈ ఏడాది తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌కు గౌతమ్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు.