Short News

తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు, రైళ్లు, విద్యాసంస్థలు బంద్!

తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు, రైళ్లు, విద్యాసంస్థలు బంద్!

తమిళనాడు, కేరళలో భారీ వర్షాలుపడుతున్నాయి. వచ్చే 48 గంటల్లో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్బంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కోస్తా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలో భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యింది. సముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా తమిళనాడు, కేరళ అతలాకుతలం అవుతోంది. తుత్తుకుడి జిల్లాలో బుధవారం అన్ని విధ్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

యూపీలో చక్రం తిప్పిన యోగి... 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ!

యూపీలో చక్రం తిప్పిన యోగి... 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ!

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ 9 సీట్లు గెలుచుకుంది. 8 సీట్లు గెలుచుకున్నట్లు ముందే ప్రకటించారు. 9వ అభ్యర్ధిగా బీఎస్పీ నుంచి తలపడిన భీమ్‌రావ్ అంబేద్కర్ గెలుస్తారని అంతా ఆశించారు. అయితే 9వ సీటును కూడా బిజెపి గెలుచుకుంది. 9వ సీటుకు సంబంధించి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యూహంతో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఎస్పీ అభ్యర్ధికి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆశించారు కానీ అలా జరగలేదు.

శివానీ రాజశేఖర్ సినిమాకు మార్చి 24న ముహూర్తం

శివానీ రాజశేఖర్ సినిమాకు మార్చి 24న ముహూర్తం

నటుడు రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివానీ తొలి చిత్రం మార్చి 24న అన్న‌పూర్ణ స్టూడియోలో లాంచ్ కానుంది. ఉద‌యం 8 గం.ల‌కు పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభించి 8.36ని.ల‌కు షూటింగ్ ప్రారంభిస్తారు. బాలీవుడ్ హిట్ సినిమా '2 స్టేట్స్' తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్  సంగీతం అందించ‌నున్నాడు. అడ‌వి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటీమణులు భాగ్యశ్రీ, లిజీ, రజత్ కపూర్, ఆదిత్య కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ కుంచె దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది ఎన్టీఆర్ కాదు..ప్రిన్స్

ఇది ఎన్టీఆర్ కాదు..ప్రిన్స్

యాంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయనున్న క్రేజీ ప్రాజెక్ట్ కోసం అమెరికా జిమ్‌ ట్రైనర్‌ స్టీవెన్స్ లాయిడ్ స‌మ‌క్షంలో మేకొవ‌ర్ మార్చుకుంటున్నాడు. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ వ‌ర్కవుట్ ఫోటో అంటూ ఓ పిక్ సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొట్టింది. దీనిపై జిమ్ ట్రైన‌ర్ క్లారిటీ ఇస్తూ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ఎన్టీఆర్ కాదు. ఆ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి హీరో ప్రిన్స్ అని తేలింది. ప్రిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో నుండి స్క్రీన్ షాట్ తీసి ఎన్టీఆర్ అంటూ ప్ర‌చారం చేసారు.