Short News

భారీ వర్షాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ముంచెత్తుతున్న వరదలు

భారీ వర్షాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ముంచెత్తుతున్న వరదలు

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కర్ణాటక, అస్సాం, మేఘాలయ, కేరళ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరేం, త్రిపుర రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది. కేరళలో వరదల వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. దాదాపు లక్ష మంది ప్రజలు వరదల బారినపడ్డారు.

ప్రియుడి కొత్త ప్రియురాలిపై మాజీ ప్రేయసి దాడి

ప్రియుడి కొత్త ప్రియురాలిపై మాజీ ప్రేయసి దాడి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తనతో ఏడాది పాటు డేటింగ్ చేసిన ప్రియుడు తనను వదిలి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ప్రియుడి కొత్త ప్రియురాలిపై కత్తితో దాడి చేసింది. అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన అంకిత హబ్రా ఓ యువకుడితో ఏడాదిపాటు డేటింగ్ చేసింది. అనంతరం విబేధాలతో ప్రియుడికి దూరమైంది. దీంతో ప్రియుడు 12వతరగతి చదువుతున్న మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెపై కోపం పెంచుకున్న అంకిత కత్తితో ఆమె తల,చేతులపై పొడిచింది. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో  5.0 తీవ్రతతో భూప్రకంపనలు

అండమాన్ నికోబార్ దీవుల్లో 5.0 తీవ్రతతో భూప్రకంపనలు

అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదని కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు చెప్పారు. తెల్లవారుజామున రెండు గంటలకు భూమి కంపించిందని పేర్కొన్నారు. ప్రకంపనలు భూమికి పదికిలోమీటర్ల లోతులో సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజి అధికారులు చెప్పారు. అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూప్రకంపనల వల్ల పర్యాటకులకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు వివరించారు.
కశ్మీరీలను చంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు

కశ్మీరీలను చంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు

జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలనను వ్యతిరేకిస్తూ ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్‌లో నరమేధం జరిగే అవకాశం ఉందని గురువారం ఒక మెయిల్‌ భారత మీడియా ఛానళ్ళకు చేరింది. 'మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్‌ సహా మిగతా నేతలు అభిప్రాయాలతో మేం ఏకీభవిస్తున్నాం. ఇకపై అమాయకులైన కశ్మీరీలు పెద్ద సంఖ్యలో మరణిస్తారు. వారిని ఊచకోత కోసేందుకే గవర్నర్‌ పాలన విధించారు. భాజపా ప్రభుత్వం పెద్ద ఎత్తున 'ఆపరేషన్‌ ఆల్‌అవుట్‌' పేరిట కశ్మీరీలను చంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఈమెయిల్‌లో దుయ్యబట్టారు. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more