Short News

త్వరలో రానున్న హైస్పీడ్ రైళ్ళు

త్వరలో రానున్న హైస్పీడ్ రైళ్ళు

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ళ కోసం కొత్త హై స్పీడ్ కారిడార్లను నిర్మించనుంది. పదివేల కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తారు. దీని నిర్మాణంపై కసరత్తులు మొదలుపెట్టారు. కిలోమీటరు నిర్మాణానికి వందకోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. జాతీయ రహదారుల పక్కన రైలు ట్రాక్ నిర్మించాలని యోచిస్తున్నారు.
ధోని.. నా నిద్ర డిస్టర్బ్‌ చేసాడు ..విజిల్ పోడు

ధోని.. నా నిద్ర డిస్టర్బ్‌ చేసాడు ..విజిల్ పోడు

చెన్నై, బెంగుళూరు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ధోని, రాయుడు సిక్సర్లతో చెలరేగి ఆడటంతో చెన్నై జట్టు 5వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై జట్టుపై అభిమానులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'మిస్టర్‌ కూల్‌' ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ ట్విట్టర్‌లో కామెంట్లు చేసాడు. 'ఓరి దేవుడా, కాసేపు పడుకుందామనుకుంటే సిక్సర్ల వర్షంతో నా నిద్రకు భంగం కలిగించి చైన్నైకి విజయాన్ని అందించారు. ధోని విశ్వ విఖ్యాత ఆటగాడు. మీ ఆటకు విజిల్‌ వేయాల్సిందే (విజిల్‌ పోడు)' అంటూ కొనియాడాడు.
ఓవర్సీస్ బాక్సాఫీస్ ప్రిన్స్ మహేష్‌ పంజా.. అమెరికాలో ‘భరత్’ సరికొత్త రికార్డు!

ఓవర్సీస్ బాక్సాఫీస్ ప్రిన్స్ మహేష్‌ పంజా.. అమెరికాలో ‘భరత్’ సరికొత్త రికార్డు!

ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం కలెక్షన్ల పంట పండిస్తున్నది. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ రూ.150 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తిరగరాస్తున్నది. అమెరికాలో భరత్ అనే నేను సరికొత్త రికార్డును నెలకొల్పింది.అమెరికాలో ప్రిన్స్ మహేష్ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. గత వారం రోజులో భరత్ అనే నేను రూ.17 కోట్లు ( 2.6 మిలియన్లు) వసూలు చేసింది.

'మొబైల్ నెంబ‌ర్‌తో ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి కాదు'

'మొబైల్ నెంబ‌ర్‌తో ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి కాదు'

మొబైల్ ఫోన్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2017 ఫిబ్రవరి 6న ఇచ్చిన తీర్పును కేంద్రం ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుందని వ్యాఖ్యానించింది. ‘‘లోక్‌నీతి ఫౌండేషన్ కేసులో సిమ్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటూ తన ఆదేశాల్లో పేర్కొంది. అలా చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు..'' అని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. మొబైల్ నంబర్ వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరించాలని చెప్పామని వెల్లడించింది.