Short News

దేశంలో ఇక హైస్పీడ్ రైళ్లు.. 10 వేల కిలోమీటర్ల కారిడార్ నిర్మాణం, రైల్వేశాఖ నిర్ణయం

దేశంలో ఇక హైస్పీడ్ రైళ్లు.. 10 వేల కిలోమీటర్ల కారిడార్ నిర్మాణం, రైల్వేశాఖ నిర్ణయం

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్... దేశంలో హైస్పీడ్ రైళ్ల కోసం అవసరమయ్యే కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ నిర్ణయించింది. గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. తొలుత దేశంలో పదివేల కిలోమీటర్ల దూరం వరకు కొత్తగా హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తారు. దీనిపై కసరత్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రకటించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్ణయించారు.

నిజమైన ‘నాయకన్’: కమల్ ఆహ్వానంపై కేటీఆర్ ఆసక్తికరం

నిజమైన ‘నాయకన్’: కమల్ ఆహ్వానంపై కేటీఆర్ ఆసక్తికరం

తమిళనాట రాజకీయ అరంగేట్రం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌కు తెలంగాణ మంత్రి కేటీ రామారావు అభినందనలు తెలిపారు. కమల్ రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా బుధవారం సాయంత్రం మదురైలో నిర్వహించబోతున్న సభకు తనను కూడా ఆహ్వానించారని కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 'రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సందర్భంగా మదురైలో నిర్వహిస్తున్న సభకు నన్ను కూడా పిలిచినందుకు కమల్ హాసన్‌జీకి ధన్యవాదాలు.

తగ్గని తొలిప్రేమ జోష్ .. దూసుకెళ్తున్న వరుణ్ కలెక్షన్ల గ్రాఫ్

తగ్గని తొలిప్రేమ జోష్ .. దూసుకెళ్తున్న వరుణ్ కలెక్షన్ల గ్రాఫ్

ఓవర్సీస్ మార్కెట్‌లో టాలీవుడ్ చిత్రాలు తొలిప్రేమ దుమ్మురేపుతున్నది. తొలి ప్రేమ ఒక మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఇక తొలిప్రేమ తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తుండటం విశేషం. తొలిప్రేమ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రెండోవారంలోకి ప్రవేశించింది.

నేను రాలేను. కమల్ కు కేటీఆర్ ట్వీట్

నేను రాలేను. కమల్ కు కేటీఆర్ ట్వీట్

మ‌ధురైలో ఈ రోజు జ‌రుగ‌నున్న‌ త‌న‌ రాజ‌కీయ పార్టీ ఆవిర్భావ స‌భ‌కు క‌మ‌ల్ హాస‌న్‌ ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు. తెలంగాణ మంత్రి కేటీయార్‌ను కూడా ఆహ్వానించారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల రాలేక‌పోతున్నానని క‌మ‌ల్ కు చెప్పేశారు కేటీఆర్‌. కొత్త ఇన్నింగ్స్‌లోనూ మీరు రాణించాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు. మీ రాజ‌కీయ అరంగేట్ర కార్య‌క్ర‌మానికి ఆహ్వానించినందుకు మీకు ధ‌న్య‌వాదాలు అంటూ చెప్పారు కేటీఆర్.