Short News

షాక్: ఇండియన్స్‌కు యూకే వీసాల నిరాకరణ

షాక్: ఇండియన్స్‌కు యూకే వీసాల నిరాకరణ

ఇండియాకు చెందిన పలు రంగాల ప్రోఫెషనల్స్‌కు వీసాలు ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం నిరాకరిస్తోంది. గత ఏడాది డిసెంబర్ నుండి సుమారు 6 వేలకు పైగా యూకే వీసాలను నిరాకరిస్తున్నారు. యూకేకు చెందిన ప్రోఫెషనల్స్‌కు వీసాలు నిరాకరిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.2017 డిసెంబర్ నుండి ఇప్పటివరకు సుమారు 6,080 మంది ఇండియన్స్‌కు యూకే వీసాలు నిరాకరించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఇండియాకు చెందిన ఇంజనీర్లు, ఐటీ ప్రోఫెషనల్స్, డాక్టర్లు, టీచర్లతో పాటు పలు రంగాల్లోని ప్రోఫెషనల్స్‌కు యూకే వీసాలను నిరాకరిస్తున్నారు.

రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

అరుణాచల్‌ప్రదేశ్‌‌ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు మొదలు పెట్టింది. 40 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు ఆదివారం ఓ మీడియా నివేదిక వెల్లడించింది. చైనా ఆధ్వర్యంలోని టిబెట్‌లోని ల్హున్జె ప్రాంతంలో ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ఇది భారత్ సరిహద్దు వెంటే ఉందని హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అయితే దక్షిణ టిబెట్‌ను తన దేశంలో భాగంగా చేసుకోనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టింద'ని వెల్లడించింది.
చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

పంజాబ్‌ జట్టు అద్భుతాలేమీ చేయలేదు. ప్లేఆఫ్స్‌ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన ఆ జట్టు 5 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో మట్టికరించింది. మొదట లుంగి ఎంగిడి (4/10) సంచలన బౌలింగ్‌ ప్రదర్శన చేయడంతో పంజాబ్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సురేశ్‌ రైనా (61 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో చెన్నై 5 బంతులుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రాయుడు (1), డుప్లెసిస్‌ (14), బిల్లింగ్స్‌ (0) విఫలమవడంతో చెన్నై 27/3తో కష్టాల్లో పడింది.  హర్భజన్‌ (19), దీపక్‌ చాహర్‌ (39) చెలరేగి ఆడి జట్టుపై ఒత్తిడి తగ్గించారు.
స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు వశం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఐదు చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు. మొద‌టిది మొబైల్ డేటా ఆఫ్ చేయ‌డం. దీని ద్వారా మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో పనికి అంతరాయం కలగకుండా ఉంటుందని చెబుతున్నారు. రెండోది రోజులో కొంత సమయం గ్యాడ్జెట్స్ ప‌క్క‌న పెట్టి ఆటలు, సంగీతం, సమాజ సేవ వంటి వాటికి స‌మ‌యం కేటాయించడం. మూడోది ఫోన్లో అన‌వ‌స‌ర క‌బుర్లు చెప్ప‌డం ఆపాలి. నాలుగు.. నిద్ర‌పోయే ముందు సెల్ ఫోన్ వాడొద్దు. చివ‌రిది.. కొన్నాళ్లు సాధార‌ణ మోడ‌ల్ ఫోన్ వాడండి.