Short News

షాక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ బీజేపీలో చేరుతున్నారా?

షాక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ బీజేపీలో చేరుతున్నారా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. అయితే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆనంద్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. విజయ్‌నగర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఆయన గెలుపొందారు.

సీనియ‌ర్ న‌టుడు హేము అధికారి క‌న్నుమూత‌

సీనియ‌ర్ న‌టుడు హేము అధికారి క‌న్నుమూత‌

ప్రముఖ నటుడు హేము అధికారి (81)కన్నుమూశారు. ఊపరితిత్తుల సంబంధిత సమస్యతో బాధ పడుతున్న హేము అధికారి నిన్న దాదర్‌లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. రాజ్‌కుమార్ హిరానీ-సంజయ్‌దత్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ లగే రహో మున్నాభాయ్‌లో కీలక పాత్ర పోషించారు హేము అధికారి. ఆయన ధ్యాస్ పర్యా, హరీశ చంద్రాచి ఫ్యాక్టరీ వంటి మరాఠీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హేము అధికారికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. హేము అధికారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
మహిళల ఐపీఎల్: సూపర్ నోవాస్ ఘన విజయం

మహిళల ఐపీఎల్: సూపర్ నోవాస్ ఘన విజయం

ఒక్క రోజు మహిళల ఐపీఎల్  భాగంగా జరిగిన ఆటలో సూపర్ నోవాస్ విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన సూపర్ నోవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాట్స్ ఉమెన్స్ అంతా సమిష్టిగా ఆడటంతో ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టుపై సుపర్ నోవాస్ జట్టు గెలుపొందింది. మిథాలీరాజ్ 22, డానియల్లే వ్యాట్ ,24, హర్మన్ ప్రీత్ కౌర్ 21, సోపియా డెవిన్ 19 పరుగులు చేసి జట్టును విజయంలో భాగస్వాములయ్యారు. అంతకుముందు టాస్ గెలిచిన సూపర్ నోవాస్ బౌలింగ్ ఎంచుకోవడంతో ట్రై బ్లేజర్స్ బ్యాటింగ్ చేపట్టి.. ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
మైక్రో మ్యాక్స్ 'భార‌త్ గో' స్మార్ట్ ఫోన్ వ‌చ్చేసింది

మైక్రో మ్యాక్స్ 'భార‌త్ గో' స్మార్ట్ ఫోన్ వ‌చ్చేసింది

దేశీయ మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్ భారత్‌లో తన మొదటి ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్ ఫోన్‌ను ఇవాళ విడుద‌ల‌ చేసింది. 'భారత్ గో' పేరిట విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.4,399 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ అందిస్తున్న మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. 4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ త‌దిత‌ర ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.