Short News

పుల్వామాలో జవానును అపహరించిన ఉగ్రవాదులు

పుల్వామాలో జవానును అపహరించిన ఉగ్రవాదులు

ఉగ్రవాదులు గురువారం మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా భారత సైనికుడ్నే అపహరించుకునిపోయారు. కాశ్మీర్‌లోని రజౌరీ జిల్లాకు చెందిన ఔరంగజేబ్ అనే జవానును ఉగ్రవాదులు అపహరించినట్లు భద్రతాధికారులు తెలిపారు. ఆయన ఒక ప్రైవేటు వాహనంలో వెళుతుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని చెప్పారు. 44రాష్ట్రీయ రైఫిల్‌కి ఈ సైనికుడ్ని గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు వాహనాన్ని ఆపి, షోపియాన్ వరకు తీసుకెళ్లాలని కోరాడని తెలిపారు.

'ఎన్టీఆర్'తో మిస్సయింది ..దర్శకత్వం చేయాలని ఉంది

'ఎన్టీఆర్'తో మిస్సయింది ..దర్శకత్వం చేయాలని ఉంది

నటి నివేదాపేతురాజ్‌ 'ఒరు నాళ్‌కూత్తు' చిత్రంతో సినిమాల్లో ప్రవేశం చేసి  తొలి చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగు, తమిళంలో మరో రెండు సిఇమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. నివేద తాజాగా జయంరవితో కలిసి 'టిక్‌ టిక్‌ టిక్‌' చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'నా పని నేను చేసుకుపోతున్నాను. అందుకే వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా జూనియర్‌ ఎన్‌టీఆర్‌తో నటించే అవకాశం పోగొట్టుకున్నా. దర్శకత్వం చేయాలన్న ఆశ ఉంది' అని చెప్పింది.
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పోస్టు రేసులో చందు సాంబశివరావ

ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పోస్టు రేసులో చందు సాంబశివరావ

ఏపీ ప్రభుత్వం మీడియా సలహాదారుడు పదవికి ఇటీవలే రాజీనామా చేశారు పరకాల ప్రభాకర్. అయితే పరకాల రాజీనామాతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు ఎవరిని నియమించాలనే దానిపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టుకు అన్ని రంగాల్లో అనుభవం ఉన్న టీడీపీ సీనియర్ నేత చందు సాంబశివరావు అయితే న్యాయం చేయగలరనే అభిప్రాయాన్ని ఆపార్టీ అగ్ర నేతలు వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ ఆవిర్భావం నుంచే ఆ జెండా మోసిన ఘనత చందు సాంబశివరావుదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అల్లు అరవింద్ మెగా ప్లాన్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో  భారీ చిత్రం!

అల్లు అరవింద్ మెగా ప్లాన్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రం!

మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా మంది బడా నిర్మాతలు కోరుకుంటారు. మహేష్ కు ఉండే క్రేజ్ తో సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ కు కాసుల వర్షమే. అల్లు అరవింద్ నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. అల్లు అరవింద్ కు భారీ చిత్రాలని నిర్మించే స్థాయి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అదే ఆయన సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలిపితే నిజంగా ఆశ్చర్యకరమే. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ ఎక్కువగా మెగా కాంపౌండ్ లోనే చిత్రాలని నిర్మించారు. అలాంటిది ఇలా మహేష్ తో సినిమా అంటే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more