Short News

అక్షయ తృతీయ: బంగారం కొనుగోలులో 20 శాతం పెరుగుదల

అక్షయ తృతీయ: బంగారం కొనుగోలులో 20 శాతం పెరుగుదల

ఏప్రిల్ 18వ తేదీన అక్షయ తృతీయ ఉంది. ఈ రోజు బంగారం కొనడం చాలామందికి ఆనవాయితీ. దీంతో ఆభరణాల కొనుగోలు భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. అక్షయ తృతీయ కారణంగా ఆభరణాల విక్రయాలు పెరిగే అవకాశానికి తోడు, పెళ్లిళ్లల సీజన్. దీంతో సుమారు 15 నుంచి 20 శాతం వరకు అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, పసిడి ధరల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని అంటున్నారు.

నాది కూడా కథువా ఘటనలాంటిందే

నాది కూడా కథువా ఘటనలాంటిందే

బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో టీమిండియా పేసర్‌ మహ‍్మద్‌ షమీ భార్య హసిన్‌ జహాన్‌ పాల్గొంది. ఈ సందర్భంగా హసిన్‌ షాకింగ్‌ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో పోల్చుకుంది. ఒక రకంగా తాను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. తానింకా బతికున్నానని.. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. తన క్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు.
అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర పోషించడం చాలా కష్టంగా ఉందన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్'లో ఆయన మన్మోహన్‌సింగ్ పాత్రను పోషిస్తున్నారు. తాను ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు మన్మోహన్‌సింగ్ చరిత్రను అధ్యయనం చేశానని తెలిపారు. ఎంతో కష్టమైన పాత్రను పోషిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర పోషించడం తన సినీ కెరీర్ లో సవాల్ గా నిలిచిందన్నారు అనుపమ్‌ఖేర్.  
కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.