Short News

జియో డీటీహెచ్ సంచలన ఆఫర్

జియో డీటీహెచ్ సంచలన ఆఫర్

ఇదే గనుక నిజమైతే టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం డీటీహెచ్(డైరెక్ట్-టు-హోమ్) రంగాన్ని కూడా తాకనుంది. త్వరలోనే డీటీహెచ్ రంగంలోకి అడుగుపెట్టనున్న జియో.. అతి తక్కువ ప్యాకేజీకే ఎక్కువ టీవి చానెళ్లను అందించే ఆఫర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రచారం జరుగుతోంది.కేవలం రూ.200కే ఎస్ డి(స్టాండర్డ్ డెఫినిషన్), రూ.400కి ఎస్ డి+హెచ్ డి(హై డెఫినిషన్) చానెల్స్ అందించనున్నట్టు సమాచారం.లేటెస్ట్ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్‌) కింద ఈ జియో హోమ్‌ టీవి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్ర మొదలైంది

వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్ర మొదలైంది

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్రకు రెడీ అవుతున్నాడు. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు క్రిష్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గురువారం ప్రారంభించారు. అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం లీడ్ యాక్టర్స్‌ కొద్ది రోజులుగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో వ్యోమగామిగా కనిపించనున్నాడట.  
బాలకృష్ణ ఎన్ని సార్లు అలా మాట్లాడలేదు.. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే టార్గెట్, ఎందుకో మాకు తెలుసు!

బాలకృష్ణ ఎన్ని సార్లు అలా మాట్లాడలేదు.. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే టార్గెట్, ఎందుకో మాకు తెలుసు!

శ్రీరెడ్డి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా మారడం వెనుక ఉన్న కుట్రలు తనకు తెలుసు అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. శ్రీరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతుండడంతో ఆయన టీవీ9 తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్రోలింగ్ వలనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలకు ఆయన ధీటైన సమాధానం ఇచ్చారు.పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ట్రోలింగ్ చేయరని అన్నారు. ట్రోలింగ్ చేస్తున్న వారంతా పవన్ కళ్యాణ్ అభిమానులే అని గ్యారెంటీ ఉందా అంటూ ప్రశ్నించారు.

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

ఈఐఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 67 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి మే 2, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
ఖాళీల సంఖ్య: 67
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 2, 2018
జీతం వివరాలు: రూ. 60,000 - 1,80,000/-
విద్యార్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి కాలం ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు
వయో పరిమితి: జనరల్: 25ఏళ్లు, ఓబీసీ: 28ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ: 30ఏళ్లు.