Short News

జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ: ఎలా ఉండబోతుందో కూడా చెప్పేశారు

జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ: ఎలా ఉండబోతుందో కూడా చెప్పేశారు

జైలు నుంచి విడుదలైన ఐదు నెలల అనంతరం రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు రిటైర్డ్ జస్టిస్ కర్ణన్. త్వరలోనే 'యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ' పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించబోతున్నట్టు బుధవారం ఆయన ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుందని చెప్పిన కర్ణన్.. అన్ని స్థానాల్లోనూ మహిళలనే బరిలోకి దింపనున్నట్టు చెప్పడం గమనార్హం.'వ్యవస్థాపక సభ్యుని హోదాలో నేను పార్టీని స్థాపించాను. మహిళలు మాత్రమే పార్టీ తరుపున పోటీ చేస్తారు.

శ్రీకాంత్‌కు ప్రత్యేక బహుమతి పంపించిన ధోని

శ్రీకాంత్‌కు ప్రత్యేక బహుమతి పంపించిన ధోని

ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌కు క్రికెట్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీకి అతడు వీరాభిమాని. కొద్దిరోజుల క్రితం చెన్నై ఫ్రాంఛైజీ.. శ్రీకాంత్ జెర్సీ నంబర్ 7తో ఉన్న టీషర్ట్‌ను కూడా అతని కోసం పంపించింది. తాజాగా ధోనీ నుంచి ప్రత్యేక బహుమతిని కూడా అతడు అందుకున్నాడు. ధోనీ బ్యాట్‌ను గిఫ్ట్‌గా పొందాలనుకున్న అతడి కల నెరవేరింది. ధోనీ స్వయంగా సంతకం చేసిన బ్యాట్‌ను శ్రీకాంత్ ఇంటికి పంపించాడు. లవ్..లక్..బెస్ట్ విషెస్ ఫర్ శ్రీకాంత్ అని రాసి మహీ సంతకం కూడా చేశాడు.   
రాధిక కుమారస్వామిని చూశారా..?

రాధిక కుమారస్వామిని చూశారా..?

ఓవైపు కర్నాటక రాజకీయ పరిణాలపై దేశమంతా చర్చిస్తుంటే మరోవైపు కుమారస్వామి సతీమణి గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. నెటిజన్లు గూగుల్‌లో కుమారస్వామి పర్సనల్ ప్రొఫైల్ గురించి వెతకడం ప్రారంభించారు. సెర్చింగ్ సమయంలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. రాధికా కుమారస్వామి మే 18న గూగుల్ సెర్చింగ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తిగా నిలిచారు. రాధిక ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి. కన్నడ సినిమాల్లో రాధిక హీరోయిన్‌గా నటించారు. వీరికి షమికా కే స్వామి అనే కూతురు కూడా ఉంది. రాధికకు కూడా ఇది రెండో వివాహం.
ఈ చిరునవ్వుల కోసమే 24 గంటలుగా నిద్రపోలేదు

ఈ చిరునవ్వుల కోసమే 24 గంటలుగా నిద్రపోలేదు

శనివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ ఉత్కంఠభరిత విజయంపై కోల్‌కతా ఫ్రాంఛైజీ సహయాజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ చిరునవ్వులు చూసేందు కోసమే 24 గంటలుగా మెలకువతోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇక నిద్రపోలేను అని ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, నరైన్ నవ్వుతున్న ఫొటోలను షేర్ చేశాడు.